Jeevitha: కోమటదాని లెక్క అంటూ జీవిత తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించడంపై ఆర్య వైశ్యుల ఆగ్రహం..

Published : May 19, 2022, 11:37 AM IST
Jeevitha: కోమటదాని లెక్క అంటూ జీవిత తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించడంపై ఆర్య వైశ్యుల ఆగ్రహం..

సారాంశం

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ మూవీ మే 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. యాక్షన్ , థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ మూవీ మే 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. యాక్షన్ , థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. 

ప్రీ రిలీజ్ వేడుకలో జీవిత రాజశేఖర్ తమ కుమార్తెల గురించి చెబుతూ ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తమ కూతుళ్లు ఇద్దరికీ ఫుడ్ అంటే బాగా ఇష్టం అని చెప్పిన జీవిత.. శివాని పేరు స్విగ్గి వాళ్లందరికీ తెలుసు అంటూ సరదాగా తెలిపింది. 

అది కోమటదాని లెక్క.. డబ్బులు ఇచ్చేవరకు స్విగ్గి వాళ్ళని విడిచిపెట్టదు అంటూ జీవిత నోరు జారింది. తన కుమార్తెని ఉద్దేశించి ఆమె సరదాగా అలా కామెంట్స్ చేసినప్పటికీ.. ఆర్యవైశ్యులని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దీనితో జీవిత కామెంట్స్ వివాదంగా మారాయి. 

దీనితో జీవిత కామెంట్స్ పై ఆర్యవైశ్యులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.  డబ్బు విషయంలో తాము పిసినారులుగా ఉంటామని అర్థం వచ్చేలా జీవిత మాట్లాడడం దారుణం అని అంటున్నారు. 

ఇదిలా ఉండగా రాజశేఖర్, జీవిత ఇద్దరూ తరచుగా ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవల గరుడవేగ చిత్ర ఫైనాన్సియల్ వ్యవహారం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జీవిత మరో వివాదంలో చిక్కుకున్నారు. శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో బాగా వ్యాపించిన రోజుల్లో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?