NTR Birthday CDP: లెట్స్ ట్రెండ్... ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ వచ్చేసింది.. సెలెబ్రేషన్స్ షురూ!

Published : May 18, 2022, 07:13 PM IST
NTR Birthday CDP: లెట్స్ ట్రెండ్... ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ వచ్చేసింది.. సెలెబ్రేషన్స్ షురూ!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ స్టార్ట్ చేయగా... బర్త్ డే సీడీపీ విడుదల చేశారు.   


ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే (NTR Birthday) ఫ్యాన్స్ కి చాలా స్పెషల్. ఆర్ ఆర్ ఆర్ మూవీతో తమ హీరో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. వెయ్యికోట్ల వసూళ్లతో దుమ్ముదులిపాడు. నేషనల్ వైడ్ ఎన్టీఆర్ నేమ్ మారుమ్రోగింది. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ నటనను కొనియాడుతూ కథనాలు రాయడం జరిగింది. నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రం కావడంతో అభిమానులు ఓ రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) ని సెలబ్రేట్ చేసుకున్నారు. 

అలాగే గత రెండేళ్లుగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరగలేదు. కరోనా సంక్షోభం నేపథ్యంలో... వేడుకలు నిర్వహించవద్దని ఎన్టీఆర్ స్వయంగా పిలుపునిచ్చారు. ఆంక్షల కారణంగా బహిరంగ వేడుకలకు ఆస్కారం లేకుండా పోయింది. రెండేళ్ల తర్వాత గతంలో మాదిరి బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకునే అవకాశం దొరికింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు వేడుకలకు సిద్ధమయ్యారు. అలాగే పలు చోట్ల సేవా, సామాజిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కాగా ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ (NTR Birthday CDP) ఆవిష్కరించడం జరిగింది. ఎన్టీఆర్ తన కెరీర్ లో చేసిన అద్భుతమైన పాత్రల సమాహారంగా బర్త్ డే సీడీపీ రూపొందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కామన్ డీపీ వైరల్ గా మారింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే పురస్కరించుకుని ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై స్పష్టత రానుంది. కొరటాల శివతో చేస్తున్న ఎన్టీఆర్ 30 (NTR 30) అప్డేట్ తో పాటు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీపై అధికారిక ప్రకటన రానుంది. ఇక శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే కమల్ హాసన్, ఎన్టీఆర్ కలయికలో మూవీ అన్న మాట వినిపిస్తుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే... ఈ అన్ని ప్రాజెక్ట్స్ పై బర్త్ డే నాడు స్పష్టత వచ్చే సూచనలు కలవు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?