Prema Entha Madhuram: భర్తకి కట్టు కథలు చెబుతున్న అను.. భార్యని అలా చూసి షాకైన ఆర్య!

Published : Mar 14, 2023, 07:26 AM IST
Prema Entha Madhuram: భర్తకి కట్టు కథలు చెబుతున్న అను.. భార్యని అలా చూసి షాకైన ఆర్య!

సారాంశం

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కధ,కథనాలతో అందరి హృదయాలని దోచుకుంటుంది. మంచి రేటింగ్ తో ఈ సీరియల్ టిఆర్పి లో టాప్ ప్లేస్లో ఉంది. ఇక ఈరోజు మార్చి 13 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో  చూద్దాం.   

 ఎపిసోడ్ ప్రారంభంలో  వెళ్లి ఆనంద్ ని పిలండి అని శారదమ్మ అనగా నేను వెళ్లి పిలుస్తాను అని అను ఇంటి బయటకు వెళ్తుంది. అప్పుడు అంజలి, మా అప్పు చాలా కలివిడిగా ఉంటుంది ఎప్పుడు అందరితో కలిసిపోయి ఉంటుంది అని అంటుంది. ఇంతలో అను బయటకు రాగా నీకు అంజలి ఎలా తెలుసు? తనతో నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ఆర్య .

ఒక రోజు అంగన్వాడీలో తను నాకు కనిపించారు సార్.మొదటి పరిచయంలోనే బాగా క్లోజ్ అయ్యారు అప్పుడు నుంచి బా మాట్లాడుతూ ఉండేవారు. ఈరోజు కూడా ఎక్కడికి ఏమిటి అని చెప్పకుండా తీసుకొని వచ్చేసారు ఇక్కడికి అని తెలిస్తే వచ్చేదాన్ని కాదు అని అంటుంది. పోనీలే,రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు ఆర్య. అప్పుడు శారదమ్మ, మాన్సీ తో అక్కడున్న వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇప్పిస్తుంది. 

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ అని అంజలి అనగా మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు వర్ధన్ కుటుంబం ఈ మాత్రం గౌరవాలు అయినా చేస్తుంది అని చెప్పి మానసి చేత అను కి చీర ఇప్పిస్తుంది శారదమ్మ. మానసి లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో శారదమ్మ స్వయంగా వచ్చి ఆర్య కి బట్టలు ఇస్తుంది. ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పి అంజలి వాళ్ళు బయలుదేరుతారు. 

అందరూ వెళ్లిపోయిన తర్వాత చివర్లో అను, ఆర్యలు ఇద్దరు శారదమ్మ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకొని హత్తుకుంటారు. ఆ దృశ్యాన్ని చూసిన మాన్సీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో అంజలి తన ఇంట్లో కూర్చొని ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే ఇంకొక ప్రాజెక్ట్ రావడం ఏంటి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నర్వస్ కూడా ఉన్నది అని అనుకుంటూ, అప్పు మనింటికి గెస్ట్లు వస్తున్నారు టి అవన్నీ రెడీ చేసి ఉంచు అని అంటుంది.

ఇంతలో వాళ్ళు వచ్చి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినా సరే మార్కెట్లో మంచి హైప్ తెచ్చుకున్నారు మీరు అందుకే ఈ ప్రాజెక్టు మీకు ఇద్దామనుకుంటున్నాము అని అంటారు. నాదేమీ లేదు మా టీం వర్క్ నాకు ఒక మంచి టీం మేనేజర్ దొరికారు అంతే అని అనగా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ అయినది అని ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఉంటారు.

ఇంతలా అను వచ్చి టీ ఇస్తుంది ఇలా మా ప్రాజెక్ట్ మేనేజర్ ని కూడా ఇక్కడికి రమ్మన్నాను.అదిగో వచ్చేసారు అని అంజలి అనగా వెనుకకి తిరిగి చూసేసరికి ఆర్య అను వైపే చూస్తూ ఉంటాడు. అను చాలా భయంగా వణికి పోతుంది అనుని ఆ స్థితిలో చూసి ఆర్య చాలా బాధపడతాడు. అప్పుడు అను మొఖం కిందకి దించుకొని వెళ్లి ఆర్య కి టీ ఇస్తుంది ఆ సమయంలో తన చేతులు వణుకుతూ ఉంటాయి.

ప్రాజెక్ట్ గురించి ఏ వివరాలు వినకుండా ఆర్య ఆలోచనలన్నీ అను వైపే ఉంటాయి ఇంతలో అను కాఫీ కప్పును కింద పడేస్తుంది. విరిగిన గాజు ముక్కలు తీస్తూ ఉండగా నేను వచ్చి సహాయం చేస్తాను అని ఆర్య వచ్చి అనుకి సహాయం చేస్తాడు. అను అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత తను తడిగుడ్డతో కాఫీ పడిపోయిన దగ్గర తుడుస్తూ ఉండగా ఆర్య చూసి తట్టుకోలేక పోతాడు.

మరోవైపు ప్రాజెక్ట్ ఎలా ఉన్నది అని వాళ్ళు అడగగా బానే ఉన్నది అందరికీ ఉపయోగపడుతుంది చేస్తాము అని అంటాడు.ఆ ప్రాజెక్ట్ గురించి వచ్చిన వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అంజలి, అనుని ఆర్యని చూస్తూ మీ ఇద్దరూ నాకు లక్కీ ఛామ్స్ మీ ఇద్దరు వచ్చినప్పుడు నుంచే నా సుడి తిరిగింది అని ఆనందంగా చెబుతుంది. అప్పుడు ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అను ఆరోజు రాత్రి ఇంటికి వెళ్ళగా ఆర్య ఇంటి బయట కూర్చుని ఉంటాడు. ఆర్య తన మీద కోప్పడినట్టు నేను తెస్తున్న జీతం చాలడం లేదా నువ్వు కూడా తేవడానికి ఇలాగ నాకు తెలియకుండా పని చేస్తున్నావా అని కోపగించుకున్నట్టు ఊహించుకుంటుంది. కానీ అను అక్కడికి వెళ్లేసరికి ఆర్య ఏమి అనకుండా లోపలికి వెళ్దాం అని అంటాడు.

మిమ్మల్ని మోసం చేసినందుకు నామీద కోపం రావడం లేదా సార్ అని అను అనగా, నిన్ను కష్టపెట్టకూడదు అని నాకు ఎంత ఆరాటంగా ఉంటాదో నా కష్టాన్ని పంచుకోవాలి అని నీకు అంతే ఆరాటంలో ఉంటుంది అని నాకు తెలుసు. అప్పుడు కంపెనీలో వర్క్ చేస్తూ నా వర్క్ ప్రెషర్ ని మోసావు ఇప్పుడు ఇలా నాకు తెలియకుండా పనిచేసి నా భారాన్ని సగం మోస్తున్నావు ఇందులో తప్పేమీ లేదు అను. 

నేను ఎక్కడ బాధపడతానో అని నా దగ్గర దాచావు అంతే కదా నేను అర్థం చేసుకోగలను అని ఆర్య అంటాడు. ఆ మాటలకి ఆనందం తో వెళ్లి భర్తను హత్తుకుంటుంది అను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్