Prema Entha Madhuram: మాన్సీని కోలుకోలేని దెబ్బకొట్టిన ఆర్య.. భర్తని అక్కడ చూసి కంగారుపడ్డ అను!

Published : Mar 09, 2023, 11:29 AM IST
Prema Entha Madhuram: మాన్సీని కోలుకోలేని దెబ్బకొట్టిన ఆర్య.. భర్తని అక్కడ చూసి కంగారుపడ్డ అను!

సారాంశం

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొడుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈరోజు మార్చి 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.    

ఎపిసోడ్ ప్రారంభంలో ఇంత తక్కువ మందితో సోషల్ నెట్వర్క్ సహాయంతో పని చేయించారు అని ఆర్య గురించి చెప్తుంది అంజలి. ఇంత తక్కువ మందితో పని ఎలా సాధ్యమవుతుంది అని మాన్సీ అడగగా.. ఎస్ యు ఆర్ రైట్ వీళ్ళతోనే కాదు ఇంకా నా బ్యాకప్ టీం కూడా ఉన్నది అని ఆ పాత సైట్ ఇంజనీర్స్ ని చూపించి వీళ్ళు అందరూ రాత్రింబగళ్లు షిఫ్ట్ మీద షిఫ్ట్ చేసి పనిని ఇంత త్వరగా అవ్వగొట్టేలా చేశారు అని అంటాడు ఆర్య.

వాళ్లని అక్కడ చూసిన మాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీరజ్ వచ్చి.. మా దాదా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక మంచి టీం ని ఎన్నుకొని దానికి ఒక మంచి లీడర్ ని వెతికితే ఆ టీం ఎప్పటికైనా ముందడుగు వేస్తుందని. ఈరోజు మీరు మీ మేనేజర్ ని ఎంచుకోవడంలో అదే పని చేశారు చాలా బాగుంది అని చెప్పి ఆర్య ని వెళ్లి హత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీరజ్. ఆ మాటలకి అంజలి చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత సీన్ లో మాన్సీ ప్రీతిని కొట్టి అసలు ఏం జరుగుతుంది..

అక్కడికి నిన్ను పంపించి ఏమి ఉపయోగం.. మన వైపు ఉన్న ఇంజనీర్స్ అందరూ బ్రో ఇన్ లా కి సహాయం చేయడం ఏంటి.. ఆ ప్రాజెక్ట్ ఆపుతానని నువ్వు.. అను ని కిడ్నాప్ చేస్తానని జలంధర్.. అసలు ఈ ప్రాజెక్ట్ లేకుండానే చేస్తాను అని నేను ముగ్గురు ఇప్పుడు ఫూల్స్ అయి కూర్చున్నాము అని అనగా మీరేం బాధపడొద్దు గతం గురించి మర్చిపోండి భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేనొక మంచి ప్లాన్ వేసి వాళ్ళ పతనానికి దారి చూపుతాను అని జలంధర్ అంటాడు.

త్వరగా చేయు అని చెప్పి మాన్సీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో అను వంట చేస్తూ ఉండగా అంజలి వచ్చి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఆనంద్ అక్కడ ఎంత బాగా నా గౌరవాన్ని నిలబెట్టాడో అని జరిగిన విషయం అంత చెప్పి థ్యాంక్స్ బంగారం నువ్వు వచ్చినప్పుడు నుంచి నాకు ఏదో ఒక మంచి జరుగుతూనే ఉన్నది. అందుకే నేను నిన్ను బంగారం అని పిలుస్తున్నాను అని అంటుంది.

ఇంతలో ఆర్య అక్కడికి వచ్చి మేడం మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా అందుకే వచ్చాను అని అంటాడు. నేను మిమ్మల్ని కాఫీ తాగడానికి పిలిచా గురూజి. అలాగని చెప్తే రారు కదా అందుకే ఇలా సాకులు వెతికాను కాఫీ తాగండి అని అనగా ఇంతలో అను కాఫీ తీసుకు వస్తుండగా ఆర్య ని చూసి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పు ఏంటి వచ్చి వెళ్ళిపోయింది అని అనుకుంటూ అంజలి కిచెన్ లోకి వస్తుంది. 

వచ్చి వెళ్ళిపోయావు ఏమి బంగారం అని అంజలి అనగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి మేడం అని అంటుంది అను. అప్పుడు కాఫీని తానే వెళ్లి తీసుకొని ఇస్తుంది అంజలి. కానీ కాఫీ ఆర్య షర్టు మీద పడగా  వెళ్లి క్లీన్ చేసుకుంటాడు అదే సమయంలో.. ఎక్కడ ఆర్య తనని చూసేస్తాడేమో అని అను కింద దాక్కుంటుంది. తర్వాత కాఫీ తాగకుండా అక్కడి నుంచి ఆర్య వెళ్ళిపోతాడు. మరోవైపు నీరజ్, వదినమ్మ కి పప్పు, పచ్చడి ఇవన్నీ ఇష్టం.

అలాగే నేను చెప్పిన వంటకాలు కూడా చేసి పెట్టండి రేపు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనగా మాన్సీ అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో కనుక్కుందామని అనుకుంటుంది. మళ్లీ ఆగిపోయి పూజలు, వ్రతాలు అన్నారంటే ఉదయాన్నే లేపి నా చేత పనులు చేయిస్తారు తప్పించుకోవడం మంచిది అని  వెళ్ళిపోతుంది. తర్వాత శారదమ్మ నీరజ్ తో, నిన్నటి వరకు చిన్నపిల్లాడిలా ఉండేవాడివి ఇప్పుడు ఒకేసారి ఎదిగిపోయావు.

ఈ క్షణం ఆర్య ని చూసినంత ఆనందంగా ఉన్నది అని అనగా.. దాదా ఎప్పుడూ నేను గౌరవం దక్కేల ప్రవర్తించాలని బాధ్యతగా ఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు అలాగే ఉంటున్నాను అని అనగా శారదమ్మ ఎంతో సంతోషపడి అపార్థాలతో విడిపోయి మళ్ళీ ఒకటయ్యే బంధాలు ఇంకా గట్టి పడతాయి అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో అను తన ఎదురింటి పిల్లలు ఇద్దరికీ చదువు చెప్తూ ఉంటుంది. మీ వల్లేనమ్మా మా పిల్లలు ఇద్దరు రెండు అక్షరాలు ముక్కలైనా చదవగలుగుతున్నారు. 

ఇంట్లో చదువుకున్న మాటలు వింటే ఆనందంగా ఉన్నది అని అనగా ఇంతలో ఆర్య అక్కడికి వచ్చి మీరు పెద్దయ్యక ఏం అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఒక అమ్మాయి టీచర్ అవుతాను అని అనగా ఇంకొక అబ్బాయి నేను మీలాగే మంచి లీడర్ అవుతాను సార్ అందరినీ మంచి అడుగులలో నడిపిస్తాను అని అంటాడు. మరి నీకు పుట్టబోయే బిడ్డను ఏం చేయాలనుకుంటున్నావు అక్క అని ఆ అమ్మాయి అడుగుతుంది.

ఆర్య వర్ధన్ లా తయారు చేయాలనుకుంటున్నాను అని అను అంటుంది. ఆయనెవరు అని వాళ్ళు అడగగా ఆయన ఒక పెద్ద బిజినెస్ మాన్. కష్టపడి చాలా పెద్ద అంతస్తులకు ఎదిగారు. అందరినీ సమానంగా చూసుకుంటారు తన కుటుంబానికి ప్రాణాలైనా ఇస్తారు అలాంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని అంటుంది అను. ఆ మాటలకి ఆర్య నవ్వుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్