ఎంట్రా రెచ్చిపోతున్నావ్.. రాకింగ్ రాకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి

Published : Mar 09, 2023, 11:23 AM ISTUpdated : Mar 09, 2023, 11:26 AM IST
ఎంట్రా రెచ్చిపోతున్నావ్.. రాకింగ్ రాకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి

సారాంశం

రాకింగ్ రాకేశ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది యాంకర్ శ్రీముఖి. వార్నింగ్ అంటే ఏదో చిన్నా చితకా బెదిరింపు కాదు.. లఫూట్ అంటూ.. పచ్చిగా తిడుతూ రెచ్చిపోయింది యాంకర్. ఇంతకీ శ్రీముఖి రాకేష్ కు ఎందుకు వార్నింగ్ ఇచ్చింది...?   


శ్రీముఖికి కోపం వచ్చింది..  రాకింగ్ రాకేష్ మీద రెచ్చిపోయింది. కోపం వచ్చీ రావడంతోనే తిట్ల దండకం మొదలెట్టింది. తిట్లంటే అన్నీ ఇన్నీ కావు.. లఫూట్ అంటూ ముఖం మీదనే అనేసింది. ఇంతకీ శ్రీముఖీకి ఎందుకు కోపం వచ్చిందంటే..?. శ్రీముఖి  హోస్ట్ గా చేస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. దీనికోసం తారల జంటలు తెగ కష్టపడుతున్నారు. ఫైనల్ గా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఫైనల్స్ కు స్పెషల్ గెస్ట్ లు కూడా వచ్చారు. దాంతో.. ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. 


ఇక మిస్టర్ అండ్ మిసెస్ లో ఏ జంట  విన్నర్‌ గా నిలుస్తారా.. అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విన్నర్ ను ఫైనల్ చేయడం కోసం ఫైనల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వచ్చారు.  అలాగే శివ బాలాజీ, హీరోయిన్ స్నేహా కూడా జడ్జిలుగా ఉన్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో.. గతంకంటే కాస్త డోస్ పెంచి .. టాస్కుల మీద టాస్క్ లు ఇస్తూ.. కంటెస్టెంట్ దంపతులను ఓ ఆట ఆడేసుకున్నారు. ఇక ఈ ఫైనల్స్ లో రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న బుల్లితెర జంట రాకింగ్ రాకేష్‌- సుజాత కూడా పాల్గోన్నారు. ఈ ఇద్దరు ఉండటంతో గేమ్ ఇంకాస్త సందడిగా.. అల్లరిగా తయారయ్యింది. 

ఇక టాస్క్ లు ఆడే క్రమంలో.. యాంకర్ శ్రీముఖి రాకింగ్ రాకేష్ కి మాస్ వార్నింగ్‌ ఇచ్చింది. లఫూట్‌, ఎంట్రా అంటూ.. రచ్చరచ్చ చేస్తూ.. రెచ్చిపోయింది. శ్రీముఖి ఆ రేంజ్ లో ఫైర్ కావడంతో రాకేష్ బిత్తరపోయి చూస్తుండిపోయాడు. అసలేం జరిగింది అనేది ఆడియన్స్ కు అర్దం కాలేదు.  ఎపిసోడ్ లో భాగంగా జంటలకు బాస్కెట్ బాల్ కాంపిటీషన్ పెట్టారు. ఒకరు కళ్లకు గంతలు కట్టుకుని బాల్ వేస్తే రెండో వాళ్లు ఒక స్టూల్ మీద నిల్చొని దానిని బాస్కెట్ లో పడేలా చేసి గోల్ చేయాలి. 

 

అయితే ఈ గేమ్ ఆడే టైమ్ లో  రాకేష్ బాల్స్ వేయగా.. సుజాత పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈక్రమంలో రాకేశ్ గేమ్ విషయంలో రాంగ్ ఆడటమే కాకుండా... శ్రీముఖిని క్వశ్చన్ చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చి  శ్రీముఖి ఫైర్ అయ్యింది.  2 స్టెప్స్ లేవని ముందే చెప్పినాగారా లఫూట్.. చేయి లేస్తుందేంద్రా మళ్లీ కాపురానికి పనికి రాకుండా పోతావ్ చెప్తున్నా.. అంటూ ఊర మాస్  వార్నింగ్‌ ఇచ్చేసింది. దాంతో అంతా షాకింగ్ గా చూస్తూ అలా ఉండిపోయారు. ప్రస్తుతం  ఈ ప్రోమో సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌