మహేష్ బాబు కు పాటలు పాడి తప్పు చేశాను.. ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు

Published : Apr 05, 2023, 08:36 PM IST
మహేష్ బాబు కు పాటలు పాడి తప్పు చేశాను.. ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

మహేష్ బాబు సినిమా  గురించి సంచలన వాఖ్యలు... చేశారు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్. గతంలో మహేష్ బాబుకు పాటలు పాడి తప్పు చేశాన్నారు. ఇంతకీ ఆయన ఎందుకు అంత మాట అన్నారు. 

ఒకానోక టైమ్ లో ఆర్పీ పట్నాయక్  టాలీవుడ్ సంగీతాన్ని ఒక ఊపు ఊపారు. వరుస సినిమాలు సంగీతం అందిస్తూ.. ఎక్కువ పాటలు పాడుతూ.. దూసుకుపోయారు. యంగ్ హీరో సినిమా అంటే ఆర్పీ మ్యూజిక్ ఉండాల్సిందే. ఇప్పటికీ ఆర్పీ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయినవి ఎన్నో.. ఈక్రమంలో ఆయన జయం, మనసంతా నువ్వే, నిజం, సంబరం, దిల్, సంతోషం.. ఇలా ఒక్కటేమిటి.. సూపర్ హిట్ మ్యూజికల్ హిట్స్ ఎన్నో అందించారు. ఇక రాను రాను ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావడం.. ఆర్పీ మ్యూజిక్ కు ఆదరణ తగ్గిపోవడంతో.. 2016 వరకూ సినిమాలకు మ్యూజిక్ చేసిన ఆర్పీ.. ఆతరువాత అసలుకే మానేశారు. 

అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్స్.. ఈవెంట్స్.. ఇంటర్వ్యూలలోకనిపిస్తుంటారు ఆర్పీ. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన జీవితంలో  రీగ్రేట్ అయిన సందర్భాలు చాలా తక్కువ.. అసలు లేవనే చెప్పాలి.. కాని మహేష్ బాబుకు పాటలు పాడినందకు మాత్రం బాధ పడ్డానన్నారు. ఇన్నేళ్ల కెరీర్​లో నిజం సినిమా విషయంలో మాత్రం తాను రిగ్రెట్ ఫీలవుతానని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. నిజం సినిమాకు  మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సింగర్ ఉషతో కలసి తాను ఎక్కువ భాగం పాటలను పాడానన్నారు ఆర్పీ. 

అయితే మహేష్​కు తన వాయిస్ అస్సలు సెట్ కాలేదని.. తన గొంతు ఒక యంగ్ హీరోకు మాత్రమే సరిపోయేలా.. పిల్లాడి గొంతులా ఉంటుంది. కాని స్టార్ హీరోకోసం పాడాలి అంటే తన వాయిస్ సెట్ అవ్వదు  అని ఆర్పీ చెప్పుకొచ్చారు. అందుకే తాను ఈ సినిమాకు పాటలు పాడాల్సింది కాదు అని అనుకున్నారు పట్నాయక్. అంతే కాదు చాలా మంది నిజం సినిమా  టైమ్​లో ఫోన్ చేసి ఇదే విషయాన్ని తనకు  చెప్పారని అన్నారు ఆర్పీ. అంతే కాదు  ఛాన్స్ ఉందని ఎలా పడితే అలా పాడేస్తావా అంటూ.. ముఖం మీదే అడిగేవారని ఆర్పీ చెప్పారు. అందుకే అప్పటి పరిస్థితి తలుచుకుని అప్పుడుప్పుడు రిగ్రేట్ అవుతున్నా అన్నారు ఆర్పీ పట్నాయక్. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి