Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' కి బాలయ్య ప్రశంసలు

Published : Jan 01, 2022, 05:15 AM IST
Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' కి బాలయ్య ప్రశంసలు

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఇటీవలే విడుదలయింది.  ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. శ్యామ్ పాత్రలో నాని అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఇటీవలే విడుదలయింది.  ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. శ్యామ్ పాత్రలో నాని అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే సాయి పల్లవి కూడా ఎప్పటిలాగే నటనతో కట్టిపడేసినట్లు చెబుతున్నారు. ఇక దర్శకుడు రాహుల్ ఈ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సైతం శ్యామ్ సింగ రాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. రెండు విభిన్నమైన పాత్రల్లో నాని నటన అద్భుతంగా ఉంది. ఎమోషనల్ గా ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య నేడు శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని వీక్షించారు. చిత్ర యూనిట్ బాలయ్యకు ప్రత్యేక షో ప్రదర్శించారు. సినిమా చూసిన అనంతరం బాలయ్య నాని తో పాటు దర్శకుడు శ్యామ్ సింగ రాయ్ చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారు. 

శ్యామ్ సింగ రాయ్ చిత్రం నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కింది. ఈ చిత్రంలో నాని కి జోడిగా  సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. 

Also Read: డీప్ ట్రబుల్ లో RRR మూవీ.. తమిళనాడులో 50% ఆక్యుపెన్సీ ఆదేశం

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం