అర్జున్ రాంపాల్ నోటి వెంట బాలయ్య పాపులర్ డైలాగు, విన్నారా?

Published : May 10, 2023, 10:56 AM ISTUpdated : May 10, 2023, 10:58 AM IST
అర్జున్ రాంపాల్ నోటి వెంట బాలయ్య పాపులర్ డైలాగు, విన్నారా?

సారాంశం

బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ మీద సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది.  ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే అది విలన్ పాత్రేనా .. లేదా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

నందమూరి బాలకృష్ణ  హీరోగా యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా  తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. చిత్ర టీమ్ ఆ విషయాన్ని అఫీషియల్ గా  వెల్లడించింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు ''జాతీయ పురస్కార గ్రహీత, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్ గారికి వెల్కమ్! తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది'' అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమా పేర్కొంది. ఆల్రెడీ ఆయన షూటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. 
 
'ఫ్లూట్ జింక ముందు ఊదు! సింహం ముందు కాదు' - నట సింహం చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్! ఇప్పుడు దీనిని అర్జున్ రాంపాల్ చెప్పారు. అంతే కాదు, అనిల్ రావిపూడి సినిమాలో మంచి మంచి డైలాగులు ఉన్నాయని ఆయన వివరించారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ మీద సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది.  ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే అది విలన్ పాత్రేనా .. లేదా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

ప్రస్తుతం ఈ  సినిమా సెట్స్ పై ఉంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. బాలయ్య సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో కాజల్ సందడి చేయనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో తన మార్క్ కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌