బలగం ఫేమ్ వేణు ఎల్దండి బాలయ్యతో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. వేణు డైరెక్షన్ లో మూవీ చేసేందుకు బాలయ్య పచ్చజెండా ఊపారట.
వేణు ఎల్దండి పరిశ్రమకు వచ్చి ఏళ్ళు గడుస్తుంది. కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించారు. వేణు వండర్స్ పేరుతో జబర్దస్త్ టీమ్ లీడర్ గా కామెడీ స్కిట్స్ చేశాడు. అయితే తనలోని దర్శకత్వ ప్రతిభను బలగం మూవీతో బయటకు తీశాడు. ఈ ఏడాది విడుదలైన బలగం సంచలన విజయం నమోదు చేసింది. విలేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బలగం రికార్డు వసూళ్లు సాధించింది. చెప్పాలంటే బలగం ఊహించని విజయం సాధించింది.
క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బలగం చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బలగం అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఈ క్రమంలో బలగం వేణు స్టార్ హీరోలు, నిర్మాతల కంట్లో పడ్డాడు. ఆయనకు ఆఫర్ ఇచ్చేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా నటసింహం బాలయ్యతో వేణు ఎల్దండి మూవీ చేసే అవకాశం కలదట. బాలయ్యను కలిసి వేణు ఎల్దండి కథ వినిపించారట. బాలయ్య ఇంప్రెస్ కావడంతో పాటు మూవీ చేద్దామని హామీ ఇచ్చారట.
ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. వేణు ఎల్దండికి దిల్ రాజు మరో ఆఫర్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. వేణు కూడా ఈ వాదనకు ఒప్పుకున్నారు. వేణు కథ వినిపించి హీరోని లాక్ చేస్తే... దిల్ రాజు నిర్మించనున్నాడట. బాలయ్యతో మూవీ ఆఫర్ ఓకే అయితే వేణు ఎల్దండికి లక్ చిక్కినట్లే.
బాలయ్య ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో బాలయ్య ఓ మూవీకి సైన్ చేశాడే ప్రచారం జరుగుతుంది. ఇక 2024 ఎన్నికలే టార్గెట్ గా బాలయ్యతో బోయపాటి శ్రీను ఒక మూవీకి ప్లాన్ చేస్తున్నారట. మిగతా ప్రాజెక్ట్స్ సంగతి ఎలా ఉన్నా... అనిల్ రావిపూడి తర్వాత బాలయ్య-బోయపాటి కాంబో పట్టాలెక్కే సూచనలు కలవు.