అదే ఫోజైతే.. ఎలా అఖిల్..?

Published : Nov 07, 2018, 02:48 PM IST
అదే ఫోజైతే.. ఎలా అఖిల్..?

సారాంశం

అక్కినేని నటవారసుడిగా పరిచయమైన అక్కినేని అఖిల్ ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. కానీ ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. దీంతో 'తొలిప్రేమ' వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' అనే సినిమాలో నటిస్తున్నాడు.

అక్కినేని నటవారసుడిగా పరిచయమైన అక్కినేని అఖిల్ ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. కానీ ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. 

దీంతో 'తొలిప్రేమ' వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు దీపావళి సంధర్భంగా చిత్రబృందం ఈ సినిమా నుండి కొత్త స్టిల్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎలా ఉందనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

అఖిల్ నటించిన 'అఖిల్','హలో' అలానే ఈ 'మిస్టర్ మజ్ను' సినిమాల పోస్టర్లను పోల్చి చూస్తూ మూడింటిలో అఖిల్ ఫోజులు ఒకేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్ లో ఎక్కడా క్రియేటివ్ ఎలిమెంట్ కనిపించడం లేదని.. రొటీన్ పోస్టర్ తో అలరించాలని అనుకున్న అఖిల్ ఆలోచన వర్కవుట్ కాలేదని అంటున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. దాదాపు షూటింగ్ పూర్తయింది. 2019 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు