కపిల్ దేవ్ గా ర‌ణ‌వీర్ స్టన్నింగ్ లుక్!

Published : Jul 06, 2019, 11:13 AM IST
కపిల్ దేవ్ గా ర‌ణ‌వీర్ స్టన్నింగ్ లుక్!

సారాంశం

1983లో ప్రపంచ కప్ విజయం ఇండియన్ క్రికెట్ దశను మార్చేసింది. ఇప్పటి తరానికి ఆ విజయాన్ని కళ్లకు కట్టేలా చూపే ప్రయత్నంచేస్తున్నారు. 

1983లో ప్రపంచ కప్ విజయం ఇండియన్ క్రికెట్ దశను మార్చేసింది. ఇప్పటి తరానికి ఆ విజయాన్ని కళ్లకు కట్టేలా చూపే ప్రయత్నంచేస్తున్నారు. దర్శకుడు కబీర్ ఖాన్ '83' పేరుతో కపిల్ దేవ్ బయోపిక్ ని రూపొందిస్తున్నారు.

విష్ణు ఇందూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ర‌ణ‌వీర్  సింగ్.. కపిల్ దేవ్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ర‌ణ‌వీర్ సీరియస్ గా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనతో పాటు కొందరు నటులు కూడా శిక్షణ తీసుకుంటున్నారు. ఒకప్పటి క్రికెటర్ బల్వీందర్ సింగ్ ఆధ్వయంలో శిక్షణ పొందుతున్నారు. 

ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ శిక్షణ మొత్తం కూడా లండన్ లో జరుగుతుంది. శనివారం నాడు ర‌ణ‌వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా '83' సినిమాలో కపిల్ దేవ్ గా ర‌ణ‌వీర్ లుక్ ని విడుదల చేశారు.

ఈ లుక్ లో ర‌ణ‌వీర్ అచ్చం కపిల్ దేవ్ లానే ఉన్నారు. ఈ సినిమాలో ర‌ణ‌వీర్ భార్యగా దీపికా పదుకొన్ కనిపించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్