జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారంపై అర్జున్ కపూర్ కామెంట్!

By Udayavani DhuliFirst Published Nov 20, 2018, 10:14 AM IST
Highlights

బాలీవుడ్ ఫేమస్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' రాబోయే ఎపిసోడ్ లో అర్జున్ కపూర్ అలానే తన సోదరి జాన్వీ కపూర్ కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 

బాలీవుడ్ ఫేమస్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' రాబోయే ఎపిసోడ్ లో అర్జున్ కపూర్ అలానే తన సోదరి జాన్వీ కపూర్ కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఇందులో హోస్ట్ కరణ్.. అర్జున్ రొమాంటిక్ లైఫ్ గురించి అలానే జాన్వీ కపూర్ లవ్ స్టోరీకి సంబంధించిన ప్రశ్నలను సంధించారు. జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన ఇషాన్ ఖట్టర్ తో ఆమె ప్రేమాయణం నడిపిస్తుందని చాలా కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి బయట తిరుగుతుండడంతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఇదే విషయాన్ని కరణ్.. ఈ షోలో ప్రస్తావించారు. 

జాన్వీని ఉద్దేశిస్తూ.. 'ఇషాన్ ఖట్టర్, మీరు డేటింగ్ లో ఉన్నారా..?' అని అడిగాడు. దానికి వెంటనే జాన్వీ నో అని సమాధానమిచ్చింది. వెంటనే అర్జున్ కపూర్.. ''ఈమె ఇషాన్ తో డేటింగ్ లో లేదు కానీ అన్ని చోట్ల వీరిద్దరూ కలిసి కనిపిస్తుంటారు'' అని చెప్పాడు. తన అన్నయ్య సమాధానం విన్న జాన్వీ షాక్ అయింది.   

click me!