జీవితాంతం గుర్తు పెట్టుకుంటా, పవన్ కళ్యాణ్ పై అర్జున్ దాస్ ఎమోషనల్ కామెంట్స్

Published : Jun 07, 2025, 03:45 PM ISTUpdated : Jun 07, 2025, 05:45 PM IST
Pawan Kalyan

సారాంశం

‘ఓజీ’ చిత్రంలో అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఓజీ మూవీ సెట్స్‌ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అర్జున్ దాస్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓజీ మూవీ సెట్స్‌ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ యువ నటుడు అర్జున్ దాస్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబైలో జరుగుతున్న ఓజీ షూటింగ్ సమయంలో ఈ విధంగా పవన్, అర్జున్ దాస్ కనిపించారు.

అర్జున్ దాస్ తో పవన్ కళ్యాణ్

ఈ ఫొటోల్ని అర్జున్ దాస్ స్వయంగా ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. అందులో ఒక ఫోటోలో పవన్ కల్యాణ్ స్వయంగా అర్జున్ దాస్ తో సెల్ఫీ తీసుకుంటున్నారు. మరో ఫొటోలో ఇద్దరూ కలసి చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా అర్జున్ దాస్ తన పోస్టులో పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ పై అర్జున్ దాస్ ప్రశంసలు

అర్జున్ దాస్ తన పోస్ట్ లో,  "ఇది నిజంగా ఒక గొప్ప గౌరవం పవన్ కళ్యాణ్ గారు. మీతో పనిచేసిన ప్రతి ఒక్క రోజును జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. OG షూట్‌లో బిజీ షెడ్యూల్ లో కూడా మీరు నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీతో జరిగిన సంభాషణని ఎప్పటికీ మరచిపోలేను. మళ్లీ మీతో కలిసి పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను."  అని పేర్కొన్నారు.

 

 

‘ఓజీ’ చిత్రంలో అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో విడుదలైన ఓజీ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది అర్జున్ దాస్ కావడం విశేషం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య తన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

 

 

ఓజీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రంపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్