ThugLife Day 2 Collections: `థగ్‌ లైఫ్‌` రెండు రోజు కలెక్షన్లు.. పెరిగాయా? తగ్గాయా?.. అక్కడ మాత్రం రచ్చ

Published : Jun 07, 2025, 02:03 PM IST
thug life

సారాంశం

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన  'థగ్ లైఫ్' సినిమా రెండో రోజులు కలెక్షన్ల వివరాలు చూద్దాం. రెండు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లని రాబట్టిందంటే. 

కమల్ హాసన్ సినిమా 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్‌ కలెక్షన్లనే సాధించినా, రెండో రోజు మాత్రం డల్‌ అయ్యింది.  మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కూడా అలాంటి ఫలితమే కనిపిస్తుంది.  

'థగ్ లైఫ్' రెండో రోజు కలెక్షన్లు ఎంత?

జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన `థగ్‌ లైఫ్‌` మొదటి రోజు భారత్‌లో దాదాపు రూ.15.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించింది.  ఇందులో తమిళంలో రూ. 13.35 కోట్లు, తెలుగులో రూ.1.5 కోట్లు, హిందీలో రూ.65 లక్షలు ఉన్నాయి. 

sacnilk.com నివేదిక ప్రకారం, రెండో రోజు భారత్‌లో 'థగ్ లైఫ్' రూ.7.50 కోట్లు  వసూలు చేసింది. ఇది మొదటి రోజుతో పోలిస్తే 48.3 శాతం మాత్రమే. రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ.23 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది.  

విదేశాల్లో మంచి వసూళ్లు

`థగ్ లైఫ్' విదేశాల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. రెండో రోజు కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది. కానీ మొదటి రోజు కలెక్షన్లు మంచి సంకేతాలిస్తున్నాయి. మొదటి రోజు భారత్‌లో రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్ వస్తే, విదేశాల్లో రూ.22 కోట్లు వచ్చింది. మొత్తంగా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మార్కును దాటుతుందని అంచనా.

'థగ్‌ లైఫ్' గురించి

38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం ఈ సినిమాతో కలిసి పనిచేశారు. 1987లో వచ్చిన 'నాయకుడు' తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. 'థగ్ లైఫ్'లో కమల్ హాసన్‌తో పాటు సిలంబరసన్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్ వంటి నటులు నటించారు. 

కమల్ హాసన్ 'కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది' అన్న వ్యాఖ్యల కారణంగా ఈ సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. ఆయన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేసి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?