
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ కెలక్షన్స్ సాలిడ్ గా అందాయి. తారక్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అయితే ఊహించని విధంగా మొదటివారం అనంతరం చిత్రం యొక్క కలెక్షన్స్ సడన్ గా డ్రాప్ అయ్యాయి. సోమవారం నుంచి డల్ అయినట్లుగా తెలుస్తోంది.
మంగళవారం లెక్కలతో కలెక్షన్స్ పై ఓ క్లారిటీ వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అరవింద రిలీజై ఆరు రోజులవుతోంది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.55 కోట్లు అందుకోగా మంగళవారం అంతకంటే తక్కువగా 2.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రం 90కోట్ల థ్రియేటికల్ రైట్స్ కు అమ్ముడుపోయింది. ఆ స్థాయి వరకు షేర్స్ అందుకోవాలి అంటే కలెక్షన్స్ నెంబర్స్ పెరగాలి.
దసరా సెలవులు కాస్త ఉపయోగపడతాయి అనుకున్న మరో రెండు సినిమాలు పోటీకి దిగనున్నాయి. విశాల్ మాస్ ఎంటర్టైనర్ పందెం కోడి 2 - రామ్ కామెడీ అండ్ లవ్ ఎంటరైనర్ హలో గురు ప్రేమ కోసమే గురువారం రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రాలకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఆడియెన్స్ ను పూర్తిగా ఆకర్షించే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో అరవింద సమేత కలెక్షన్స్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.
అరవింద సమేత ఆరు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం - 15.90 cr
సీడెడ్ - 12.48 cr
ఉత్తరాంధ్ర - 6.26 cr
ఈస్ట్ - 4.51 cr
వెస్ట్ - 3.73 cr
కృష్ణ - 3.99 cr
గుంటూరు - 6.60 cr
నెల్లూరు - 2.08 cr
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వరకు అందిన షేర్స్ - Rs 55.55 cr (ఏపీ + తెలంగాణ)