
మణిరత్నం ఎంతో కష్టపడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈసినిమా మొదటి రోజు నుంచే విమర్షకుల ప్రశంసలు అందుకుంటూ ఉంది. స్టార్ కాస్ట్ నటించని ఈసినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను దాటేసింది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది సినిమా. ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 కోసం రెహమాన్ స్వరపరిచిన ఓ పాట కాపీ రైట్స్ చిక్కుల్లో పడింది.
ఈటైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం,గాయకుడు ఉస్తాద్ వసీఫుద్దీన్ దాగర్ పొన్నియిన్ సెల్వన్ 2 లోని వీర రాజా వీర పాట ట్యూన్ తన తండ్రి, మామ కంపోజ్ చేసిన ట్యూన్ నుంచి కాపీ చేశారంటూ ఆరోపించారు. దాంతో ఈ వివాదం స్టార్ట్ అయ్యింది. ఇక ఈ ఆరోపణలపై వెంటనే స్పందించారు పొన్నియిన్ సెల్వన్ 2 మేకర్స్. ఈ ఆరోపణలను నిర్మాతలు ఖండించారు. నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది. అంతే కాదు వీర రాజా వీర సాంగ్ ఏ పాటకు కాపీ కాదని గట్టిగా వాదించారు.
అంతే కాదు వసీఫుద్దీన్ ఆర్ధిక లాభం మరియూ ప్రచారం కోసం మాత్రమే ఇలా గలాట సృష్టితున్నారంటూ.. .. మేకర్స్ ఆరోపించారు. మద్రాస్ టాకీస్ ఈ పాట గురించి వివరిస్తూ.. వీర రాజా వీర అనేది 13వ శతాబ్దంలో నారాయణ పండితచార్యన్ రూపొందించిన సాంప్రదాయక ట్యూన్ అని పేర్కొంది. ఇక ఈ పాట తమ అనుమతి లేకుండా ఎలా తీసుకుంటారంటూ.. వసీఫుద్దీన్ ఏఆర్ రెహమాన్ కు లేఖ కూడా రాశినట్టు తెలుస్తోంది. కాస్త అటు ఇటుగా మార్చినా.. అది తాము కంపోజ్ చేసిన పాటే అంటూ వసీఫుద్దీన్ వాదిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక పొన్నియిన్ సెల్వన్ 2 భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది. ఈసినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ, మరియు ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించబడింది. తమిళ చరిత్ర గురించి వివరిస్తూ.. రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ధ 1955 తమిళ నవల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ రెండు సినిమాలు రూపొందించబడ్డాయి. మొదటి భాగం 2022లో విడుదల కాగా, రెండో భాగం కొన్ని రోజుల క్రితమే విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.