తెలుగులో అనగానే భయపడ్డా : ఏఆర్ రెహ్మాన్

Published : Apr 09, 2019, 02:09 PM IST
తెలుగులో అనగానే భయపడ్డా : ఏఆర్ రెహ్మాన్

సారాంశం

హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆంథెమ్‌ని సమకూర్చారు ఏఆర్ రెహ్మాన్. 'ఆగేది లేదు ఎదురే అడ్దేమున్నా..' అంటూ సాగే ఈ పాటని రాకేందు మౌళి రచించగా.. ఏఆర్రెహ్మాన్ స్వయంగా ఆలపించారు.

ఈ పాటతో పాటు సినిమా తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు రెహ్మాన్ తో పాటు సినిమాలో కీలకపాత్ర థానోస్ కి తెలుగు డబ్బింగ్ చెప్పిన హీరో రానా కూడా హాజరయ్యారు.

ఈ సినిమాలో తెలుగు పాటని తనే పాడాల్సి వచ్చిందని, తెలుగు పాట పాడడం చాలా కష్టమని, మొదటి భయపడినా.. ఆ తరువాత అర్ధం చేసుకొని పాడినట్లు రెహ్మాన్ వెల్లడించారు. దర్శకుడు పాట విన్న తరువాత కొరియన్, చైనీస్ భాషల్లో కూడా డబ్ చేయమన్నట్లు ఈ సందర్భంగా రెహ్మాన్ చెప్పారు.

తనకు నచ్చిన సూపర్ హీరో బ్లాక్ పాంథర్ అని బదులిచ్చారు. ప్రస్తుతం అతడు మణిరత్నం సినిమాకి మ్యూజిక్ చేస్తున్నట్లు, సంగీత ప్రధానమైన చిత్రాలకు పని చేయాలనుందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం