కమల్‌ `విచిత్ర సోదరులు` నటుడు అనుమానాస్పద మృతి..

Published : Aug 05, 2023, 10:08 AM ISTUpdated : Aug 05, 2023, 10:16 AM IST
కమల్‌ `విచిత్ర సోదరులు` నటుడు అనుమానాస్పద మృతి..

సారాంశం

`విచిత్ర సోదరులు`(అపూర్వ సగోధరార్గల్‌) లో కమల్‌ స్నేహితుడుగా కనిపించిన నటుడు మోహన్‌ కన్నుమూశారు. రోడ్డుపై ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన ప్రయోగాత్మక చిత్రం `విచిత్ర సోదరులు`(అపూర్వ సగోధరార్గల్‌). ఇందులో కమల్‌ స్నేహితుడుగా కనిపించిన నటుడు మోహన్‌ కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం ఆయన్ని మధురైలో చనిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. తమిళంలో పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో మెప్పించిన ఆయన అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం కలచివేస్తుంది. పోలీసుల నివేదిక ప్రకారం మధురైలోని తిరుపర్కుండ్రం ఆలయ సమీపంలోని వీధిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 

60ఏళ్ల వయసున్న మోహన్‌.. సినిమాలు అవకాశాలు లేక, చేసుకునేందుకు పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ఆయన రోడ్డుపైనే నివసిస్తున్నారని తెలుస్తుంది. సేలం జిల్లా మెట్టూర్‌కి చెందిన మోహన్‌ చిత్ర పరిశ్రమలో స్థిరపడేందుకు చాలా కష్టపడ్డారు. మరుగుజ్జు కావడంతో అన్ని రకాల ఆఫర్లు వచ్చేవి కావు. వచ్చిన కొన్ని ఆఫర్లతోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. కానీ వయసు మీద పడటంతో ఆయనకు సినిమా పరిశ్రమని ఆదుకోలేకపోయింది. 

దీంతో చాలా రోజులుగా ఆయన ఇళ్లు గడవని పరిస్థితిని ఫేస్‌ చేశారట. అంతేకాదు ఇంటిని వదిలేసి రోడ్లపై నివసించే వారని సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే మోహన్‌ బాడీని జులై 31నే స్థానికులు రోడ్డుపై గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మధురై లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మోహన్‌ మరణ వార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

ఇక కమల్‌ హాసన్‌ మరుగుజ్జుగా నటించిన `అపూర్వ సగోధరార్గల్‌`(తెలుగులో `విచిత్ర సోదరులు`) చిత్రంలో ఆయనకు స్నేహితుడిగా మోహన్‌ నటించారు. ఆయన పాత్ర మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత నాన్‌ కడవుల్‌` చిత్రంలో కనిపించారు. ఇలా కొన్ని సినిమాలు చేశారు. కామెడీ సినిమాలతో మెప్పించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు ఏమైంది? వరుసగా డైరెక్టర్లు ఎందుకు తప్పుకుంటున్నారు?