
స్టార్ హీరోయిన్ సమంతకి అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనే అరుదైన ఆహ్వానం దక్కింది. అది ఇక్కడ కాదు, అమెరికాలో కావడం విశేషం. న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియా పరేడ్ వేడుకలో పాల్గొనేందుకు సమంతని ఆహ్వానించింది సదరు అసోసియేషన్. అమెరికా బేస్డ్ గా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది.
ఆగస్ట్ 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అక్కడ అమెరికా కాలమాణం ప్రకారం ఆగస్ట్ 20 ఇండిపెండెంట్ డేకి సంబంధించిన పరేడ్‌ని నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ సిటీలో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో గెస్ట్ గా పాల్గొనేందుకు సమంతని ఆహ్వానించడం విశేషం. అయితే ఈ సందర్భంగా వాళ్లు సమంతని ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటూ సంబోధించడం విశేషమనే చెప్పాలి. అక్కడ 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌ని నిర్వహిస్తున్నారు.
సమంతతోపాటు ఆథ్యాత్మిక గురువు రవి శంకర్ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. చాలా గ్రాండ్‌గా ఈ వేడుకని నిర్వహించబోతుంది. ఇందులో ఇండియాకి చెందిన `మిషన్ లైఫ్` ముఖ్య పాత్ర పోషిస్తుంది. న్యూయార్క్ లో జరిగే ఈ ఇండిపెండెంట్ వేడుకకి సినిమా స్టార్స్ ని ఆహ్వానించడం అరుదైన విషయమనే చెప్పాలి. అది సమంతకి ఆహ్వానం రావడం ఆమెకి దక్కిన గౌరవంగా భావించవచ్చు.
ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఆమె ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం కోసం తాను విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిసింది. మరింత బలంగామారేందుకు, తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తి గా కోలుకుని తిరిగి మామూలు మనిషిలా మారేందుకు, మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా అయ్యేందుకు సామ్ ఈ బ్రేక్ తీసుకున్నట్టు తెలిపింది.
ఇటీవల ఆమె రెండు ప్రాజెక్ట్ లను పూర్తి చేసింది. విజయ్ దేవరకొండతో `ఖుషి` చిత్రంలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.దీంతోపాటు హిందీలో `సిటాడెల్` వెబ్ సిరీస్ చేస్తుంది. వరుణ్ ధావణ్ మేల్ లీడ్ చేస్తున్నారు. ఇది కూడా షూటింగ్ పూర్తయ్యింది. రెండు షూటింగ్‌లు కంప్లీట్ కావడంతో ఇక బ్రేక్ తీసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. ప్రకృతిలో అసలు లైఫ్‌ని ఆస్వాదిస్తుంది. ఆథ్యాత్మిక సేవలోనూ మునిగిపోతుంది. పూర్తిగా ఓ కొత్త లైఫ్‌ని చూస్తుంది సమంత.