BrahmaMudi: రాహుల్ ని నిలదీసిన స్వప్న.. అన్న కొడుకు చనిపోయాడు అన్న బాధలో అపర్ణ?

Published : Feb 28, 2023, 11:49 AM IST
BrahmaMudi: రాహుల్ ని నిలదీసిన స్వప్న.. అన్న కొడుకు చనిపోయాడు అన్న బాధలో అపర్ణ?

సారాంశం

BrahmaMudi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

ఈరోజు ఎపిసోడ్ లో రాజ్ కి మంగళ స్నానం చేయించడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు రాజ్, కావ్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఏమైంది రాజ్ అని వాళ్ళ అమ్మ అనడంతో ఏమీ లేదమ్మా అని అంటాడు. ఆ తర్వాత రాజ్ కి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు. స్నానం చేయించిన నీళ్లు పైపు ద్వారా వెళ్లి కావ్య మీద పడతాయి. అప్పుడు రాజ్ ని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు స్వప్న కోపంతో నాలో ఆశలు రేకెత్తించావు నన్ను ఊరించావు ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని రాహుల్ ని నిలదీస్తుంది.

అప్పుడు రాహుల్ సరికొత్త నాటకం మొదలు పెడుతూ మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది స్వప్న రాజ్ ని మోసం చేస్తున్నాం మన పెద్ద వాళ్ళని మనం మోసం చేస్తున్నాము అనడంతో స్వప్న షాక్ అవుతుంది. రెండు ఫ్యామిలీలను మోసం చేసి మనం లేచిపోవడం బాగోదు ఒకసారి ఆలోచించు అనడంతో రాహుల్ మాటలకు స్వప్న షాక్ అవుతుంది. రాహుల్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ మరి నన్ను ఎందుకు పార్టీకి ఇన్వైట్ చేసావ్ ఎందుకు ఖరీదైన బహుమతులు ఇచ్చావు. నన్ను ఎందుకు మోసం చేశావు అనగా నేను నిన్ను మోసం చేయలేదు మనసారా ప్రేమించాను అని అంటాడు రాహుల్. నేను కూడా నిన్ను మనసారా ప్రేమించాను మరి నేను నిన్ను ప్రేమించి ఆ రాజుని ఎలా పెళ్లి చేసుకోవాలి నువ్వే చెప్పు అని అంటుంది స్వప్న.

నువ్వు కాదు అంటే ఇక్కడే చచ్చిపోతాను అని చేయి కట్ చేసుకుని పోతుండగా అడ్డుపడి నీకేదైనా అయితే నేనేం అయిపోవాలి అని అంటాడు. అప్పుడు రాహుల్ స్వప్నకి ప్లాన్ వివరిస్తూ ఉండగా ఇంతలో కనకం అక్కడికి జ్యూస్ తీసుకొని వస్తుంది. పిచ్చి స్వప్న నీకు ఆస్తి అందం ఉంది కానీ తెలివి లేదు నేను నా సొంతం చేసుకోవడానికి నేను ఇలా నాటకాలు వాడుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు రాహుల్. మరొకవైపు రాజ్ ని పెళ్ళికొడుకుని చేస్తూ ఉండగా అప్పుడు వాళ్ళ చెల్లెలు మరదలు ఇద్దరు రాజ్ ని ఆట పట్టిస్తూ ఉంటారు. ఒక వైపు కావ్య పెళ్లి మండపానికి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటుంది.

ఇంతలో కనకం వాళ్ళ అక్క వచ్చి కళ్యాణ మండపాన్ని చూసి మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటారు. అక్క నాకు టెన్షన్ టెన్షన్ గా ఉంది పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని అర్థం నీకంటే ఎక్కువ టెన్షన్ గా నాకే ఉందే నువ్వు అబద్దాలు చెప్పి పెళ్లి వరకు తీసుకొని వచ్చావు వాళ్ళు చూస్తే అంత పెద్ద కుటుంబం నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది అని అంటుంది కనకం వాళ్ళ అక్క. ఆ తర్వాత ఎక్కడిది కావ్య వచ్చి అక్కని నిన్ను రెడీ చేసి వెళ్తాను ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అని నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు అనడంతో ఇంతలో వాళ్ళ పెద్దమ్మ నువ్వు ఉండవా కావ్య అనగా వద్దు పెద్దమ్మ నేను ఉండను అని అంటుంది. ఇంతలోనే అక్కడికి అప్పు వచ్చి కనకం మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది.

మరొకవైపు రాజ్ ని పెళ్ళికొడుకుని చేసి కిందికి తీసుకొని రావడంతో అందరూ రాజ్ ని చూసి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి వినాయకుడి పూజ చేస్తూ ఉంటారు. అందరూ కలిసి బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే రాజ్ వాళ్ళ అమ్మ తరపున బంధువులు చనిపోయారు అనడంతో రాజ్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ వాళ్ళ తాతయ్య  అపర్ణని నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు లేదంటే నువ్వు పుట్టింటికి వెళ్ళు ఇలా బాధపడుతూ ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్లి మీ అన్నకు ధైర్యంగా ఉండు ధైర్యం చెప్పు అని అంటాడు. చనిపోయింది నీ పుట్టింటి వాళ్లు కాబట్టి రాజ్ పెళ్లి ఆపడానికి లేదు కదా అని అంటాడు. అప్పుడు అపర్ణ నాన్న రాజ్ నేను వెళ్ళొస్తాను మా అన్నయ్య కొడుకుని పోగొట్టుకొని పుట్టాడు దుఃఖంలో ఉంటాడు నేను వెళ్లి ధైర్యం చెప్పాలి అని అంటుంది.

అమ్మ నువ్వు లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి కావాలంటే పెళ్లిని వాయిదా వేస్తాను అని రాజ్ అనడంతో వద్దు నాన్న పెళ్లి ఆపేస్తే పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లికూతురు చాలా బాధపడతారు అని అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదు నాన్న అని సర్ది చెబుతుంది. అప్పుడు అందరూ కలిసి అపర్ణను వెళ్ళమని చెబుతూ ధైర్యం చెబుతూ ఉంటారు. ఆ తర్వాత అపర్ణ, కావ్య ఇద్దరు కలిసి స్వప్నం రెడీ చేస్తూ ఉండగా అప్పుడు అపర్ణ నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తున్నావ్ అంటే బాధగా ఉంది అనడంతో అప్పుడు వారు ముగ్గురు హత్తుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు స్వప్న తన మనసులో మీ ఇద్దరి మళ్ళీ చూస్తాను లేదో ఐ యాం రియల్లీ వెరీ సారీ కావ్య, అప్పు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు బాధపడుతూ ఉంటారు.

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?