
యువ డైరక్టర్స్ నమ్మి ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు నాని. ఆయన తన కెరీర్‌లో నాగ్ అశ్విన్, శివ నిర్వాణ వంటి కొత్త దర్శకులతో సినిమాలు చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. దాంతో నాని కొత్త ప్రాజెక్ట్ గురించిన టాక్ మొదలైంది. అయితే ఈ సారి తనతో గతంలో ‘అంటే సుందరానికీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయతోనే ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
గతంలో వీరి కలయికలో రూపొందిన ‘అంటే సుందరానికీ’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ నాని కెరీర్‌లో ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలించింది. ఓటీటీ, టీవీ లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అర్బన్ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. ఈ యేడాది చివరలో షూట్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. RRR వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రంలో ఆర్ ఆర్ ఆర్ లింక్ ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రంలో నాని రాజమౌళి అశోశియేట్ గా ఆర్.ఆర్.ఆర్ కు చేస్తూంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్ ఆర్.ఆర్ లింక్ ఎంతవరకూ అనేది ప్రక్కన పెడితే మిగతా ప్రాజెక్టు మాత్రం యాజటీజ్ గా వర్కవుట్ అవుతోంది అంటన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. నానికి ఈ దర్శకుడు అంటే ఎంత నమ్మకం అనేది గతంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్దమవుతుంది.
నాని మాట్లాడుతూ... కొన్ని కథలు బాగుంటాయి. కానీ మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుందనే ఆలోచన కలుగుతుంది. కానీ వివేక్ ఆత్రేయ సినిమాలు ఆయన తప్పిదే మరొకరు తీయలేరు. నాలో ప్రేక్షకుడు వివేక్ సినిమాను మొదటి షో నాడే చూస్తాడు. అలాగే మీరు చూస్తారని ఆశిస్తున్నా అన్నారు. నాని ఖాతాలో ‘హిట్, ద థర్డ్ కేస్’ సినిమా కూడా ఉంది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రెస్టిజియస్ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ దసరా.సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశారు.సినిమా టీజర్, సాంగ్స్ అన్ని భారీ అంచనాలు ఏర్పరచాయి.మార్చ్ 30న దసరా రిలీజ్ అవుతున్న సందర్భంగా నెల మొత్తం ప్రమోషన్స్ కే కేటాయించాడట నాని.సినిమాని ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో నెల మొత్తం దసరా కోసం కేటాయించాడని అంటున్నారు.ఈమధ్య స్టార్ సినిమాలైనా సరే సరైన ప్రమోషన్స్ లేకపోతే రిజల్ట్ తేడా కొట్టేస్తున్నాయి.