Aparna Balamurali: లా స్టూడెంట్‌ అసభ్యప్రవర్తనపై హీరోయిన్‌ అపర్ణ బాలమురళి రియాక్షన్‌ ఏంటంటే?

By Aithagoni RajuFirst Published Jan 21, 2023, 7:57 AM IST
Highlights

`సూరారై పోట్రు`(ఆకాశం నీ హద్దురా) చిత్ర హీరోయిన్‌ అపర్ణ బాలమురళి.. తనపై లా విద్యార్థి అసభ్య ప్రవర్తనపై ఆమె స్పందించారు. 

`ఆకాశం నీ హద్దురా`(సూరారై పోట్రు) చిత్రంతో తెలుగులో సౌత్‌లో పాపులర్‌ అయ్యింది మలయాళ ముద్దుగుమ్మ అపర్ణ బాలమురళి. అంతేకాదు ఈ సినిమాలో నటనకుగానూ ఆమెకి ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. బలమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న అపర్ణ ఇటీవల చేదు అనుభవాన్ని చవిచూసింది. ఓ స్టేజ్‌పై ఆమెతో స్టూడెంట్ అసభ్యకరంగా ప్రవర్తించారు. తనసినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఎర్నాకులంలోని ప్రభుత్వ లా కాలేజ్‌ ఈవెంట్‌లో పాల్గొంది. 

అందులో ఓ లాస్టూడెంట్‌ స్టేజ్‌పైకి వచ్చి, అపర్ణని బలవంతంగా పైకి లేపి, ఫోటోకి దిగాడు. అంతేకాదు తనని అసభ్యకరంగా టచ్‌ చేశాడు. స్టేజ్‌పై చాలా మంది పెద్దలు ఉన్నా ఎవరూ అతన్ని ఆపలేదు సరికాదా, నవ్వుతుండటం గమనార్హం. కానీ అపర్ణ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

తాజాగా దీనిపై అపర్ణ స్పందించి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, ఈ ఘటన తనని ఎంతగానో బాధించిందని తెలిపింది. తనని బలవంతంగా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరికాదని, అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడని, ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అని అసహనం వ్యక్తం చేసింది అపర్ణ. ఈ ఘటనపై పోలీసులకు తాను ఫిర్యాదు చేయనని, అంత టైమ్ లేదని చెప్పింది. ఈ  ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణలు చెప్పారని వెల్లడించింది. విచారం వ్యక్తంచేసినట్టు తెలిపింది అపర్ణ. అందుకే దీన్ని ఇష్యూ చేయాలనుకోవడం లేదని చెప్పింది. 

అపర్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో `తన్కమ్‌` ఒకటి. ఈ మలయాళ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఈ చిత్ర బృందం కేరళాలోని లా కాలేజ్‌లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్వకుడు, హీరో వినీత్‌ శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు. మలయాళంలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అపర్ణ.. ప్రస్తుతం `తన్కమ్‌`తోపాటు `ధూమమ్‌`, `ఉలా`, `పద్మిని`, `మైండియుమ్‌ పరంజుమ్‌`, `2018` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

ఇక `సూరారై పోట్రు`లో అపర్ణ హీరో సూర్యకి జోడీగా చేసింది. సుధా కొంగర దీనికి దర్శకత్వం వహించింది. 2020లో ఓటీటీలో విడుదలైన ఈసినిమా సంచలన విజయం సాధించింది. పలు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా సూర్యకి, ఉత్తమ జాతీయ నటిగా అపర్ణకి, బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్ విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 
 

click me!