నేను రాజకీయాల్లోకి రావడంలేదు.. నన్ను లాగకండిః బండ్ల గణేష్‌ క్లారిటీ

Published : Nov 26, 2020, 09:29 PM IST
నేను రాజకీయాల్లోకి రావడంలేదు.. నన్ను లాగకండిః బండ్ల గణేష్‌ క్లారిటీ

సారాంశం

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నిర్మాత బండ్ల గణేష్‌ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై బండ్ల గణేష్‌ స్పందించారు. 

తాను ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని చెబుతున్నారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించి, క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తాను ఏ పార్టీలో చేయడం లేదని, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు తెలిపారు. 

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నిర్మాత బండ్ల గణేష్‌ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై బండ్ల గణేష్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. `నాకు ఏ రాజకీయ పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయజేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన.. మీ బండ్ల గణేష్‌` అని పేర్కొన్నారు. తనపై వరుసగా రూమర్లు వస్తున్న నేపథ్యంలో రెండు సార్లు ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు బండ్లగణేష్‌.

ఇదిలా ఉంటే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌లో చేరాడు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ తర్వాత గతేడాది తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే మళ్లీ ఆయన సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. ఆ మధ్య మహేష్‌ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో నటుడిగా కనిపించారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు