చిత్ర పరిశ్రమలో రాజకీయ చీలికలు.. మనకెందుకు రాజా?

By Prashanth MFirst Published Mar 28, 2019, 3:44 PM IST
Highlights

కలిసి ఉంటె కలదు సుఖం అని వెండితెరపై పాటలతో ఎమోషనల్ సీన్స్ తో గుండెను టచ్ చేసే నటీనటులు రియల్ లైఫ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తున్నారు. 

కలిసి ఉంటె కలదు సుఖం అని వెండితెరపై పాటలతో ఎమోషనల్ సీన్స్ తో గుండెను టచ్ చేసే నటీనటులు రియల్ లైఫ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ లో రాజకీయల డోస్ పెరిగింది. 

రాజకీయల కారణంగా మంచి ఇండస్ట్రీలో వైషమ్యాలు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. పరిశ్రమ పెద్దగవుతున్న కొద్దీ వివాదాల డోస్ కూడా పెరుగుతోంది. గతంలో ఒక వివాదం నెలకొంటే దాసరి వంటి ప్రముఖులు ఏకమై ముందు నిలబడేవారు. 

కానీ ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు నిలబడలేకపోవడంతో సిన్ పరిశ్రమపై రాళ్ళేయడం సులువుగా మారుతోంది. ఇక సొంత ఇంటిలోనే గొడవలు ఎక్కువవుతుండడంతో చులకనగా చూసే పరిస్థితి ఏర్పడింది. 

డ్రగ్స్ వివాదం నుంచి చూసుకుంటే.. శ్రీ రెడ్డి వివాదం వరకు టాలీవుడ్ కి పెద్ద దెబ్బలే తగిలాయి. బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమా వచ్చినప్పుడు  తెలుగు పరిశ్రమను పొగిడినవారే మళ్ళీ ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

దానికి తోడు మా ఎలక్షన్స్ ఇండస్ట్రీ ప్రతిష్టకు ఇంకా గట్టి దెబ్బె వేసింది. ఎవరు ఊహించని విధంగా కమిటీ సభ్యులే ఒకరినొకరు తిట్టిపోసుకోవడం.. ఆ ఎలక్షన్స్  వివాదాన్ని మీడియా ముందుకు రచ్చకీడ్చడం.. వంటి వివాదాలు పెద్ద మైనెస్ అని చెప్పాలి. 

ఇక ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా సినీ ఇండస్ట్రీలో చీలికలు తెస్తూ ఐకమత్యాన్ని దెబ్బేతీస్తున్నాయని చెప్పవచ్చు. బాలీవుడ్ - కోలీవుడ్ ఇలా ఇతర ఇండస్ట్రీలో కూడా వర్గ విబేధాలు ఉన్నా మొన్నటి వరకు టాలీవుడ్ లో అంతగా ఉండేవి కాదు. ఎవరి పని వారు చూసుకుంటూ సమస్య ఉంటె అందరూ ఏకమై పరీక్షించుకునేవారు. 

కానీ ఇప్పుడు పట్టించుకునే ప్రముఖులే కరువయ్యారు  సినిమా ఆడిందా లేదా బిజినెస్ జరిగిందా లేదా అనేవారే కానీ తల్లిలాంటి ఇండస్ట్రీలో రాజకీయాలు జరుగుతుంటే అడ్డుకునేవారు కరువయ్యారు. పైగా ఈవెంట్స్ జరిగితే ఇండస్ట్రీకి మేము అండగా ఉంటాం అది చేస్తాం ఇది చేస్తాం అనే వారు ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఆ వివాదాల్లోకి వెళ్లడం అని సైలెంట్ అయిపోతున్నారు. 

మొత్తానికి ఇండస్ట్రీలో చీలికలు ఇప్పుడు గట్టిగానే ఏర్పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ఎపి రాజకీయాలు టాలీవుడ్ పై కొంత ప్రభావం చూపుతున్నాయనే చెప్పాలి. ఇక ఎలక్షన్స్ ఎండ్ అయ్యే వరకు ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి. 

click me!