ఏపీ ఎన్నికలు: మన హీరోల మద్దతు ఎవరికంటే..?

By Udayavani DhuliFirst Published Jan 23, 2019, 12:11 PM IST
Highlights

సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయి. సెలబ్రిటీలకు రాజకీయనాయకులు హెల్ప్ చేయడం, వారి ప్రచారాల కోసం సినీ తారలు తరలి వెళ్లడం జరుగుతూనే ఉంటాయి. 

సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయి. సెలబ్రిటీలకు రాజకీయనాయకులు హెల్ప్ చేయడం, వారి ప్రచారాల కోసం సినీ తారలు తరలి వెళ్లడం జరుగుతూనే ఉంటాయి. రీసెంట్ గా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో మన తారలు ఎవరూ ప్రత్యక్షంగా ప్రచారం చేయనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని చాలా మంది కోరుకున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో మన హీరోలు ఏ పార్టీకీ మద్దతు ఇస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.  టీడీపీ, జనసేన, వైకాపా పార్టీలు పోటీలో దిగడం ఈసారి ఎలెక్షన్స్ రంజుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా మెగాఫ్యామిలీ విషయానికొస్తే.. ఆ ఫ్యామిలీ హీరోలంతా పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ'కి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఇప్పటికే వరుణ్ తేజ్, నాగబాబు, సాయి ధరం తేజ్ వంటి హీరోలు పవన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రచారానికి రెడీ అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. దాదాపు ఈ ఫ్యామిలీలో ఉన్న హీరోలంతా కూడా పవన్ కోసం ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

ఇక నందమూరి ఫ్యామిలీ విషయానికొస్తే.. పైకి మేమంతా ఒక్కటే అని నందమూరి హీరోలు చెబుతున్నా.. వారి మధ్య మాత్రం ఇన్నర్ గా గొడవలు సాగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల సొంత అక్క సుహాసిని తెలంగాణా ఎలెక్షన్స్ లో పాల్గొంటే ఈ ఇద్దరు హీరోలు మద్దతు తెలపలేదు. బాలయ్యతో, టీడీపీతో ఉన్న ఇష్యూల కారణంగా ఈసారి ఎన్నికల్లో తారక్ ప్రచారం చేసే అవకాశమే కనిపించడం లేదు.

మిగిలిన హీరోలు నారా రోహిత్, తారక రత్న వంటి వారు ప్రచారం చేసినా పెద్దగా గ్లామర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి చంద్రబాబు ఈసారి సినీ గ్లామర్ లేకుండానే ఎలెక్షన్స్ లో పోటీ చేయాల్సివుంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి పార్టీతో సంబంధం లేకుండా తన బావా గల్లా జయదేవ్ ఏ పార్టీలో ఉంటే దానికి మద్దతు పలుకుతుంటాడు. గత ఎన్నికల్లో తన బావకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సపోర్ట్ అందించాడు. మరి ఈసారి తన ప్రచారం అక్కడి వరకే పరిమితమవుతుందని అంటున్నారు.

ఇక ఇండస్ట్రీలో చాలా మంది నటులు వైకాపా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మొదటి నుండి వైఎస్సార్ తో మంచి బంధం ఉంది. జగన్ తో కూడా ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈసారి నాగార్జున తన సపోర్ట్ జగన్ కి అందించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాగార్జున ఆదేశిస్తే ఆ ఫ్యామిలీ హీరోలంతా కూడా జగన్ తరఫున ప్రచారం చేయడం ఖాయం.

మంచు ఫ్యామిలీకి జగన్ తో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోహన్ బాబు సందర్భం వచ్చిన ప్రతీసారి జగన్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈసారి ఎన్నికల్లో కూడా మోహన్ బాబు.. జగన్ కి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. నితిన్, హైపర్ ఆది అలానే మరికొంతమంది ఆర్టిస్టులు, ఇండస్ట్రీలో పవన్ అభిమానులు జనసేన పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు. 

click me!