ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

Published : Jan 23, 2019, 11:22 AM IST
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

సారాంశం

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గత ఐదేళ్లలో 'బాహుబలి' సినిమాలో మాత్రమే నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గత ఐదేళ్లలో 'బాహుబలి' సినిమాలో మాత్రమే నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుస చిత్రాల్లో నటిస్తాడని ఇక థియేటర్లలో సందడి చేస్తుంటాడని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.

బాహుబలి తరువాత 'సాహో' అనే మరో భారీ బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టాడు ప్రభాస్. ఈ కారణంగా గతేడాది ఆయన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు తన ఫ్యాన్స్ ని సంతోషపెట్టడానికి ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తను నటిస్తున్న రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

చిత్రీకరణ దశలో ఉన్న 'సాహో' సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన నాలుగు నెలల్లో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు.

మొదట ఈ సినిమా 2020 లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో డిసంబర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంటే ఈ ఏడాదిలో ప్రభాస్ రెండు సినిమాలో అభిమానులను ఖుషీ చేయబోతున్నాడన్నమాట!

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?