యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా... ఆహా ఒరిజినల్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్ లాంచ్

Published : Jun 10, 2022, 08:31 PM IST
యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్  చేతుల మీదుగా...  ఆహా ఒరిజినల్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్  లాంచ్

సారాంశం

ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా  హారర్ వెబ్ సిరీస్ అన్య'స్ ట్యుటోరియల్ టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు. 

రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న  వెబ్ సిరీస్ అన్య'స్ ట్యుటోరియల్.  ఈ హరర్ వెబ్ సిరీస్  ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది.

ఇక ఈ సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా  హారర్ వెబ్ సిరీస్ అన్య'స్ ట్యుటోరియల్ టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు.  టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, అన్య'స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్యస్ ట్యూటోరియల్ అంటూ టీమ్ లో ఉత్సాహాన్ని నింపారు. 

 

 ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే... ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే? అదే అన్య'స్ ట్యుటోరియల్. అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. రెజీనా కెసాండ్రా (మధు) కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ అంటే నచ్చదు. కానీ ఒక రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అని తెలుసుకోవాలంటే ఆహా మరియు ఆర్కా మీడియా వారి 'అన్య'స్ ట్యుటోరియల్' చూడాల్సిందే. అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ