తమిళ స్టార్ అరుణ్ విజయ్ నటించిన ‘యానై’.. తెలుగులో ‘ఏనుగు’గా అలరించేందుకు రెడీ..

Published : Jun 10, 2022, 05:25 PM IST
తమిళ స్టార్ అరుణ్ విజయ్ నటించిన ‘యానై’.. తెలుగులో ‘ఏనుగు’గా అలరించేందుకు రెడీ..

సారాంశం

తమిళంలో ‘యానై’గా రూపుదిద్దుకున్న చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ‘ఏనుగు’గా అలరించనుంది. మూవీలో తమిళ స్టార్ అరుణ్ విజయ్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు.    

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘ధర్మయోగి’ సినిమాతో నిర్మాతగా మారిన సి. హెచ్ సతీష్ కుమార్ నిర్మించిన చిత్రమే ‘యానై’. ఈ చిత్రాన్నే తెలుగులో ‘ఏనుగు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా అరుణ్ విజయ్ (Arun Vijay), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి  చేసుకొని రిలీజ్  కు సిద్ధంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలెట్టారు.  

‘ధర్మయోగి’తో పాటు బూమారంగ్, లోకల్ బాయ్స్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. ఇప్పుడు తన సొంత బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పై భారీ బడ్జెట్ తో  తమిళ "యానై" సినిమాను నిర్మించారు. జగన్మోహిని సమర్పించారు.  ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ఏనుగు’గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరి ఈ చిత్రాన్ని  డైరెక్టర్ చేయడం విశేషం. హరి గతంలో హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తెలుగు ఆడియెన్స్ లోనూ గుర్తింపు దక్కించుకున్నారు.  

ఈ సినిమాలో సముద్రఖని, KGF రామచంద్ర రాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి, ఆడుకలం జయపాలన్, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగజ్ పలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను   ఈ నెల 12న గ్రాండ్ నిర్వహించనున్నారు. మంచి కంటెంట్ తో ఫస్ట్ లైన్ ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
  

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?