అనుష్క పక్కాగా ప్రేమ‌లో ప‌డింది..

Published : Dec 07, 2016, 06:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అనుష్క పక్కాగా ప్రేమ‌లో ప‌డింది..

సారాంశం

ప్రేమలోప‌డిన అనుష్క‌  జి. అశోక్ దర్శకత్వంలో అనుష్క ముఖ్యతారగా భాగమతి మూవీ చక్కని ప్రేమకథ తో రాబొతున్న మూవీ

 అనుష్క ముఖ్యతారగా ‘పిల్ల జమిందార్’ ఫేమ్ జి. అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా ‘భాగమతి’. ఇందులో అనుష్క కలెక్టర్‌గా నటిస్తున్నారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే సామర్థ్యం ఉన్న ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారట. ప్రభుత్వం, అధికారి.. అనగానే సమస్యలు వాటి పరిష్కారంతో సినిమా ఉంటుందేమో అనుకుంటున్నారా? ఇందులో ఓ చక్కని ప్రేమకథ కూడా ఉందండోయ్! అంటున్నారు యూనిట్ సన్నిహిత వర్గాలు.

‘జనతా గ్యారేజ్’లో మోహన్‌లాల్ కుమారుడిగా నటించిన ఉన్ని ముకుందన్ ఇందులో సోషల్ యాక్టివిస్ట్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరిలో అనుష్క ఎవరితో ప్రేమలో పడతారో.. ఎవర్ని పెళ్లి చేసుకుంటారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనట.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది. అన్నట్లు, ఇటీవల నిజ జీవితంలో బెంగుళూరులో ఒక బిజినెస్‌మ్యాన్‌తో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి ఎప్పుడు సమాధానం చెబుతారో! వెయిట్ అండ్ సీ!!
 

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే