అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?

Published : Oct 04, 2018, 10:19 AM IST
అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?

సారాంశం

దక్షినాది అగ్ర హీరోయిన్లలో ఒకరైన అనుష్క 'బాహుబలి' సినిమా తరువాత మరో సినిమాకు సంతకం చేయలేదు. బాహుబలి కోసం దాదాపు ఐదేళ్ల పాటు సమయం వెచ్చించిన ఆమె ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఆమె తోటి హీరోయిన్లు కాజల్, నయన్ లాంటి తారలు వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే అనుష్క మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆమె వయసు మూడు పదులు దాటి చాలా కాలం కావడం ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అందుకే ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని కొందరు అంటుంటే.. ఆమె పర్సనాలిటీ కారణంగా యువ హీరోలు ఆమె సరసన నటించడానికి ఆసక్తి చూపడం లేదని కొందరి వాదన.

మాధవన్ సరసన ఓ సినిమాలో, గౌతంమీనన్ దర్శకత్వంలో ఓ సినిమా ఇలా చాలా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆమె వేటిపై స్పందించలేదు. దేనిపై అధికార ప్రకటన కూడా లేదు. దీంతో అసలు అనుష్కకి ఏమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు పెదవి విప్పని అనుష్క ఇప్పుడైనా బయటకొచ్చి సమాధానం చెబుతుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు
Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి