అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసేసుకున్నారు. ఆ రేటు ఇప్పటిదాకా నాగ్ ఏ చిత్రానికి పలకలేదు. దాంతో ఈ కరోనా సమయంలో నాగ్ సినిమాకు ఆ రేట్ ఇవ్వటం ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ ఆ రేటు ఎంతా అంటే అక్షరాలా 27 కోట్లు. కేవలం ఓటీటి రేట్ మాత్రమే ఇది. శాటిలైట్ ని మరో పది కోట్లకు నిర్మాత అమ్ముకోవచ్చు.
నాగార్జున హీరోగా అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమా ఆరు నెలల లాక్డౌన్ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ దశని కూడా దాటింది. కౌంటర్ టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో థియోటర్స్ లో రిలీజ్ చేసే పరిస్దితి కనపడటం లేదు. దాంతో ఓటీటిలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసేసుకున్నారు. ఆ రేటు ఇప్పటిదాకా నాగ్ ఏ చిత్రానికి పలకలేదు. దాంతో ఈ కరోనా సమయంలో నాగ్ సినిమాకు ఆ రేట్ ఇవ్వటం ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ ఆ రేటు ఎంతా అంటే అక్షరాలా 27 కోట్లు. కేవలం ఓటీటి రేట్ మాత్రమే ఇది. శాటిలైట్ ని మరో పది కోట్లకు నిర్మాత అమ్ముకోవచ్చు.
ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతారు విజయ్ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్’ చిత్రం చూడాల్సిందే.
‘‘వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్ ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో నాగ్ ‘వైల్డ్‌డాగ్’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్, రుద్రా గౌడ్, హష్వంత్ మనోహర్ కనిపించనున్నారు. సయామీ ఖేర్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది’’అని చిత్ర టీమ్ తెలిపింది.