అనుష్క నెక్ట్స్ తెలుగు సినిమా టైటిల్‌ ఫిక్స్.. ఓటీటీ కూడా ఫైనల్‌..

Published : Mar 19, 2024, 07:40 PM IST
అనుష్క నెక్ట్స్ తెలుగు సినిమా టైటిల్‌ ఫిక్స్.. ఓటీటీ కూడా ఫైనల్‌..

సారాంశం

తెలుగు తెర స్వీటి అనుష్క.. మళ్లీ సినిమాల స్పీడ్‌ పెంచుతుంది. ఇప్పుడు మరో తెలుగు సినిమాని ప్రకటించింది. ఓ క్రేజీ టైటిల్‌తో ఆమె రాబోతుంది.   

అనుష్క శెట్టి గతేడాది `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంతో ఆకట్టుకుంది. నవీన్‌ పొలిశెట్టితో కలిసి నటించి అలరించింది. ఈక్రేజీ ఫన్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్‌ తీసుకున్న అనుష్క ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించింది. క్రిష్‌ దర్శకత్వంలో ఆమె ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ టైటిల్‌ని ప్రకటించారు. `ఘాతి`(Ghaati) అనే పేరుని ఖరారు చేశారు. 

Polling: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గతంలో `శీలవతి` అనే పేరు వినిపించింది. కానీ ఎవరూ ఊహించని టైటిల్‌ని వెల్లడించడం విశేషం. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫైనల్‌ అయ్యింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా విడుదల తర్వాత ఇది అమెజాన్‌లో రాబోతున్నట్టు వెల్లడించారు. అమెజాన్‌ సంస్థ నేడు తమ సంస్థలో రాబోతున్న సినిమాలను ప్రకటించింది. అందులో `ఘాతి` ఉండటం విశేషం. 

ఇక లేడీ ఓరియెంటెడ్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ సమస్యలో ఇరుక్కున్న మహిళా వ్యాపారవేత్త దాన్నుంచి ఎలా బయటపడింది, అందుకు ఎలాంటి స్ట్రగుల్‌ ఫేస్‌ చేసింది అనే కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. అనుష్క ఇప్పుడు మరో మహిళా ప్రాధాన్యత కలిగిన సరికొత్త స్క్రిప్ట్ తో రాబోతుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. గతంలో అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌లో `వేదం` చిత్రం వచ్చింది. ఇందులో వేశ్యగా నటించింది అనుష్క. ఇప్పుడు వ్యాపారవేత్తగా కనిపించబోతుండటం విశేషం. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

ఈ మూవీ షూటింగ్‌ ఆంధ్ర,ఓడిశా బార్డర్‌లో ఎక్కువగా సాగుతుందట. సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందుకే అక్కడ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అనుష్క అధిక బరువు సమస్యతో బాధపడింది. కానీ దాన్నుంచి ఆమె బయటపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే `కథనార్‌` అనే మలయాళ మూవీని ప్రకటించింది. ఇప్పుడు తెలుగు సినిమా టైటిల్‌ ప్రకటన కూడా రావడం విశేషం. ఇక మళ్లీ ఆమె స్పీడ్‌ పెంచుతోందని చెప్పొచ్చు. 

Read more: `కంగువా` టీజర్‌ విజువల్‌ వండర్‌.. సూర్య, బాబీ డియోల్‌ల విశ్వరూపం..
Also read: నరేష్‌ నాలుగు పెళ్లిళ్లపై నవీన్‌ విజయ్‌ కృష్ణ రియాక్షన్‌ ఇదే.. వామ్మో తండ్రిని మించిన కొడుకు

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌