కరోనా లాక్ డౌన్ మన తెలుగు స్టార్స్ కు బాగానే కలిసొచ్చింది. కరోనా తర్వాత మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఓటీటి డిజిటల్ రైట్స్ ,హిందీ డబ్బింగ్ రైట్స్ రేట్లు నిర్మాతలకు పెద్ద ఎమౌంట్స్ తెచ్చిపెడుతున్నాయి. మిడిల్ రేంజి హీరోలు సైతం ఈ కొత్త ఆదాయ మార్గాలతో బాగానే లాభపడుతున్నారు. ఓటీటీ కంపెనీలు,హిందీ మార్కెట్ బయ్యర్లు ఆఫర్ చేసే మొత్తంలో తమ షేర్ ని బాగానే గుంజుకుంటున్నారు. థియోటర్ రిలీజ్ ద్వారా వచ్చే మొత్తం అనేది నామినల్ అయ్యిపోయింది. అందరూ నాన్ -థియోటర్ రెవిన్యూ మోడల్ వైపే చేస్తున్నారు. దాంతో చర్యకు ప్రతిచర్యలా హీరోలు తమ రెమ్యునేషన్స్ పెంచేస్తున్నారు తాజాగా నాని సైతం తన రెమ్యునేషన్ ని బాగా పెంచేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

కరోనాకు ముందు నాని రెమ్యునేషన్ పది కోట్ల వరకూ ఉండేది. పెంచుదామంటే వరస పెట్టి తన సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. అయితే ఒక్కసారిగా వి సినిమా డిజిటల్ రైట్స్ బాగా పలకటం, ఇప్పుడు టక్ జగదీష్ రైట్స్ సైతం ఊహించని రేట్స్ కు వెళ్లటంతో ఆయన తన రేటుని ఒక్కసారిగా పెంచేసారని సమాచారం. ఆ మొత్తం ఎంత అంటే 14 కోట్లు అని తెలుస్తోంది.
నిర్మాత వెంకట్ బోయినపల్లి తో చేస్తోన్న శ్యామ్‌సింగరాయ్ కోసం భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ఫిలింనగర్ వర్గాల టాక్ ప్రకారం నాని ఈ చిత్రం కోసం ఏకంగా రూ.14 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. ఈ సినిమాకు సుమారు 25-30 కోట్ల వరకు బడ్జెట్ అవుతుండగా..ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఈ మొత్తం రికవరీ అవుతుందని లెక్కలు వేసి నిర్మాతలు ఈ మొత్తం పెట్టే సాహసం చేస్తున్నారని అంటున్నారు.
టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఈ శ్యామ్‌సింగరాయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాతోపాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.