అలా కాజల్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన రానా

Published : Jun 21, 2017, 03:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
అలా కాజల్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన రానా

సారాంశం

కాజల్ పుట్టిన రోజు సందర్భంగా కాజల్ తో తన వీడియో పోస్ట్ చేసిన రానా కాజల్ 10ఏళ్ల ప్రస్థానంపై టీజర్ లో హైలెట్ చేసిన నేనే రాజు నేనే మంత్రి టీమ్ నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో పవర్ ఫుల్ లీడర్ జోగేంద్ర పాత్రలో రానా, రాధగా కాజల్

తెలుగు టాప్ యాక్ర్టెస్ కాజల్ ఇటీవలే జూన్ 19న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా నేనే రాజు నేనే మంత్రిలో తన హీరో రానా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రానా-కాజల్ కు సంబంధించిన ఓ టీజర్ లో కాజల్ పాత్రను పరిచచయం చేస్తూ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేసింది.

ఈ టీజర్ లో రానా కాజల్ ను అందమైన నగలతో అలంకరిస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ సన్నిహితంగా మెలిగే సీన్ కట్ చేసి టీజర్ గా రిలీజ్ చేశారు. ఈ పుట్టినరోజుతో 32ఏళ్లు నిండిన కాజల్ సినీ పరిశ్రమకు వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ టీజర్ లో కాజల్ నటిస్తున్న రాధ పాత్ర ఎంత పవర్ ఫుల్ రోల్ అనేది రానా చెప్పటం ఆకర్షిస్తుంది.

ఇక టీజర్ ఒక ఎత్తయితే.. రానా తన సోషల్ మీడియా పేజిలలో కాజల్ ను అభినందిస్తూ స్పెషల్ పోస్ట్ లు పెట్టాడు. ట్విటర్, ఫేస్ బుక్ లో రానా చేసిన పోస్ట్ లు వైరల్ అయ్యాయి. నేనే రాజు నేనే మంత్రి టీమ్ తరపున అభినందనలు అంటూ రానా అభినందించాడు. అలా కాజల్ పుట్టినరోజును మరింత స్పెషల్ చేశాడు రానా.

 

 

 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి