‘వారసుడు’ 50వ రోజు పూర్తి.. ఫ్యాన్స్ కు బిగ్ ట్రీటే.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

By Asianet News  |  First Published Mar 1, 2023, 4:19 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) తెలుగులో నటించిన తొలిచిత్రం ‘వారసుడు’. థియేటర్లలో విడుదలై నేటితో 50  రోజులు పూర్తి చేసుకుంది. మరోవైపు బాక్సీఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్స్ ను సాధించింది. 
 


తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) తెలుగులో నటించిన తొలిచిత్రం ‘వారసుడు’ (Vaarasudu). తమిళంలో ‘వరిసు’గా విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. బైలింగ్వుల్ గా రూపుదిద్దుకున్న  ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఏక కాలంలోనే రిలీజ్  అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి థియేటర్ రెస్పాన్స్ తో పాటు ఓటీటీ రెస్పాన్స్ కూడా అదిరింది. అయితే తాజాగా ఈ చిత్రం 50రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఫ్యాన్స్  ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిత్రయూనిట్ కూడా ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

అయితే, ‘వారసుడు’ థియేట్రికల్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సీఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబ్టంది. ఎనిమిదేండ్ల తర్వాత తమిళస్టార్ అజిత్ కుమార్ సినిమా ‘తునివు’తో పోటీ పడి మరీ అత్యధిక వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. చిత్రం మొదట మిశ్రమ స్పందనను పొందినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దేశ్యవాప్తంగా రూ.మొత్తం 178.80 కోట్ల నెట్ (తమిళ, తెలుగు, హిందీలతో సహా) సంపాదించిందినట్టు తెలుస్తోంది. రూ.210.98 కోట్ల గ్రాస్ వసూల్ అయినట్టు సమాచారం. ఒక ఓవర్సీస్ లో ఈ చిత్రం రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. 

Latest Videos

దీంతో మొత్తంగా ‘వారసుడు’ అన్ని కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.300.98 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అదరహో అనిపించారు. అయితే విజయ్ దళపతి కేరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలించింది.  తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉండటంతో ఈ రికార్డును బిగ్ ట్రీట్ గా భావిస్తున్నారు. తమిళ హీరో అయినా.. తెలుగు సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకోవడం సంతోషిస్తున్నారు. ఈ చిత్రం హిట్ కావడంతో నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘వరిసు’ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించింది.  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. ఇక నెక్ట్స్ విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న‘లియో’(Leo)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల వరకు ప్రీ-సేల్ బిజినెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విజయ్ సరసన త్రిష నటిస్తోంది. భారీ తారాగణం కనిపించబోతోంది. 

click me!