వైరల్ అవుతోన్న అనుష్క ఇన్స్టాగ్రామ్ ఫోటో..!

Published : Oct 29, 2018, 11:32 AM IST
వైరల్ అవుతోన్న అనుష్క ఇన్స్టాగ్రామ్ ఫోటో..!

సారాంశం

దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరైన అనుష్కకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు పదుల వయసు దాటి చాలా  కాలమవుతున్నా.. అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. అయితే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోతో ఆమె పెళ్లికి రెడీ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరైన అనుష్కకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు పదుల వయసు దాటి చాలా  కాలమవుతున్నా.. అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.

అయితే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోతో ఆమె పెళ్లికి రెడీ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. కాలికి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసిన అనుష్క.. దీనికి క్యాప్షన్ అవసరం లేదు.. అని క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో అభిమానులంతా పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటూ అనుష్కని ప్రశ్నిస్తున్నారు. వచ్చేనెల 7న అనుష్క పుట్టినరోజు ఉండడంతో.. ఆరోజే పెళ్లి వార్త చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. పెళ్లి కబురు ఎప్పుడు వినిపించాబోతున్నారు.. మీ పుట్టినరోజునా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కామెంట్లపై అనుష్క స్పందించలేదు. 

చివరిగా ఆమె 'భాగమతి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం తన శరీరబరువుని తగ్గించే పనిలో పడింది అనుష్క. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే