అనుష్కను ఆ దర్శకుడు మోసం చేశాడా..?

Published : Jul 10, 2018, 05:51 PM IST
అనుష్కను ఆ దర్శకుడు మోసం చేశాడా..?

సారాంశం

గౌతమ్ తో సినిమా చేయడం కోసం ఇతర దర్శకులు ఆమెను అప్రోచ్ అయినా.. అనుష్క అంగీకరించలేదట. కానీ ఇప్పుడు గౌతమ్ తమిళ సినిమాలతో బిజీగా ఉండడం, అనుష్క సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడనే క్లారిటీ లేకపోవడంతో అమ్మడు గౌతమ్ ను నమ్మి మిగిలిన సినిమాలు రిజెక్ట్ చేశానంటూ తన సన్నిహితుల వద్ద చెబుతోందట

దక్షినాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అనుష్కకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. నిర్మాతలు ఆమెపై కోట్లు పెట్టి సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 'బాహుబలి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఓ దర్శకుడిని నమ్మి మోసపోయిందట. నిజానికి బాహుబలి తరువాత అనుష్క మరే సినిమా సైన్ చేయలేదని. 'భాగమతి' సినిమా కూడా ఎప్పటినుండో సెట్స్ లో ఉన్న సినిమా.

ఎట్టకేలకు బాహుబలి తరువాత ఆ సినిమా విడుదలైంది. మరి అనుష్క కొత్త సినిమాలు ఏమీ చేయడం లేదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు దర్శకుడు గౌతమ్ మీనన్ పేరు వినిపించింది. బాహుబలి తరువాత అనుష్క.. గౌతమ్ మీనన్ తో సినిమా చేయాలనుకుంది. కానీ ఇప్పటివరకు ఆ  సినిమా  మొదలుకాలేదు. గౌతమ్ కథ చెప్పకపోయినా అతడిపై ఉన్న గౌరవంతో సినిమా చేయాలనుకుందని తెలుస్తోంది.

కానీ గౌతమ్ మాత్రం ఇప్పటివరకు సినిమా పనులు మొదలుపెట్టలేదు. గౌతమ్ తో సినిమా చేయడం కోసం ఇతర దర్శకులు ఆమెను అప్రోచ్ అయినా.. అనుష్క అంగీకరించలేదట. కానీ ఇప్పుడు గౌతమ్ తమిళ సినిమాలతో బిజీగా ఉండడం, అనుష్క సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడనే క్లారిటీ లేకపోవడంతో అమ్మడు గౌతమ్ ను నమ్మి మిగిలిన సినిమాలు రిజెక్ట్ చేశానంటూ తన సన్నిహితుల వద్ద చెబుతోందట.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?