హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను అడ్డంగా బుక్ చేసింద హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, గుడ్ మార్నింగ్ చెపుతూనే.. అనుపమ పోస్ట్ చేసిన ఫోటోలతో కార్పోరేషన్ పనితనాన్ని తెలిపే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.
యంగ్ టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు పెద్ద షాక్ ఇచ్చింది. అనుపమా పరమేశ్వరన్ చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆమె చేసిన ట్వీట్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ చేసిన గుడ్ మార్నింగ్ లో మీకు బాధ్యత లేదా.. అనే విధంగా.. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో.. హైదరాబాద్ లోని కొన్నికాలనీలలో ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్న చెత్త చుట్టూ.. కొన్ని ఆవులు చేరి, వాటిని తింటున్నాయి. ఈ ఫొటోలను పెట్టిన ఆమె గుడ్ మార్నింగ్ అని పోస్ట్ చేసి.. గుడ్ ని ప్రత్యేకంగా హైలెట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. GHMC ట్విట్టర్ అకౌంట్ నుండి ఆమెకు ఓ రిప్లయ్ వచ్చింది. కాని ఆ రిప్లైతో నెటిజన్లు మండిపడుతున్నారు. అర్ధం పర్ధం లేకుండా హైదరాబాద్ కార్పోరేషన్ ఇచ్చిన సమాధానంపై మండిపడుతున్నారు. ఇంతకీ GHMC ఇచ్చిన సమాధానం ఏంటంటే...?
undefined
మీరు షేర్ చేసిన ఫొటోలు ఏ ప్రాంతానికి చెందినవో చెప్పండి.. మా టీం వచ్చి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరిస్తారు అని GHMC ట్విట్టర్ అకౌంట్ నుండి అనుపమ ట్వీట్ కు రిప్లై వచ్చింది. దీంతో నెటిజన్లు GHMCపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రాంతాలు కూడా మీకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారా? అని కొందరు తిట్టిపోసోతున్నారు. అంతే కాదు.. ఆమె షేర్ చేసిన ఫొటోలలో కూడా అడ్రస్, చెత్త శుభ్రం చేసే వారి వివరాలు కూడా కనిపిస్తున్నా.. మళ్లీ అర్థరహితంగా స్పందన ఇవ్వడం ఏమిటి..? అంటూ మరికొందరు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
“Good” morning! pic.twitter.com/z2cHXUxE4F
— Anupama Parameswaran (@anupamahere)
ఇలా GHMCని టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్‌లో ఆడేసుకుంటున్నారు. అంతే కాదు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చూసినదానిని అలా వదిలేయకుండా.. ఇలా నలుగురికి తెలిసేలా చేయడంతో.. మీ గట్స్‌కి హ్యాట్సాఫ్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మా ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యే అంటూ కొందరు నెటిజన్లు వారి కాలనీలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. మొత్తంగా.. ఆవులను రక్షించాలని, వీధుల్లో చెత్తను శుభ్రం చేయాలనే అర్థం వచ్చేలా అనుపమ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. GHMCని కూడా ఇరకాటంలో పడేసింది. మరి దీనిపై ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.