‘జాతిర‌త్నాలు’అనుదీప్ నెక్ట్స్ సినిమాకు హీరో సెట్టయ్యాడు

By Surya PrakashFirst Published Jul 5, 2024, 6:38 AM IST
Highlights

త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట ఈ మూవీని నిర్మించనున్నారని తెలుస్తోంది. 


‘జాతిర‌త్నాలు’ చిత్రంలో సూపర్ హిట్ ఇచ్చిన  ద‌ర్శ‌కుడు అనుదీప్ కొత్త సినిమా ఖరారు అయ్యింది. ఆయన  శివ‌కార్తిక‌య‌న్ హీరోగా చేసిన ‘ప్రిన్స్’ యావరేజ్ అవటంతో ఆ తర్వాత ప్రాజెక్టు లేటు అవుతూ వచ్చింది. మొదట చిరంజీవి తో ప్రాజెక్టు అనుకున్నారు. ఆ తర్వాత రవితేజతో సినిమా అని వార్తలు వచ్చాయి. కానీ ఏదీ ఖరారు కాలేదు. అంతేకాదు పెద్ద బ్యానర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సితారలతో సినిమా సినిమా ప్లాన్ చేసారు. కానీ మెటీరియలైజ్ కాలేదు. చివరకు ఆయన ఓ ప్రాజెక్టు ఖరారు చేసుకున్నట్లు సమాచారం.   ఇప్పుడు అనుదీప్ మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ కు క‌థ‌ను వినిపించి ఓకే చేయించారని తెలుస్తోంది.
 
  అనుదీప్ చెప్పిన కథకు విశ్వక్ సింగిల్ సిట్టింగ్ లో  ఓకే చెప్పేశారట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట ఈ మూవీని నిర్మించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గానే అనుదీప్ తెరకెక్కిస్తాడంటున్నారు. వరస పెట్టి జానర్స్ మారుస్తూ  విభిన్నమైన సినిమాలు చేస్తున్న విశ్వక్.. పూర్తిస్థాయి కామెడీ మూవీని ట్రై చేసేందుకు అనుదీప్‍కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.   

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్‍ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉాన్నాడు.  ఈ ఏడాది రెండు హిట్లు వచ్చాయి. ప్రయోగాత్మక చిత్రం గామి అంచనాలకు మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో అఘోరగా విభిన్న పాత్రలో నటించారు విశ్వక్. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి.  అలాగే  ఆతర్వాత విశ్వక్‍సేన్ హీరోగా నటించిన మాస్ రూరల్ యాక్షన్ డ్రామా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31వ తేదీన రిలీజ్ అయింది.  అంచనాలకు తగట్టే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం సూపర్ ఓపెనింగ్ అందుకుంది. ఓవరాల్‍గా మంచి కలెక్షన్లతో హిట్‍గా అనిపించుకుంది.  
 
అలాగే విశ్వక్‍సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. విశ్వక్ నుంచి తదుపరి రానున్న సినిమా ఇదే. ఈ చిత్రానికి తేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. వీటితో పాటు లైలా అనే సినిమా కూడా చేస్తున్నారు విశ్వక్‍సేన్. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‍లో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రీ-లుక్ కూడా వచ్చింది. లేడీ గెటప్‍లో విశ్వక్‍ ముఖాన్ని కాస్త రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 

Latest Videos

click me!