
ఎపిసోడ్ ప్రారంభంలో సేల్స్ లో జరిగిన ప్రతి మార్పులు నాకు తెలిసి, నా అనుమతితోనే జరిగాయి అని ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది అను. అంతా ఓకే మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ అంటారు ఆఫీసర్స్. డ్యూటీ మీరు చేశారు అంటాడు ఆర్య. మీలాంటి లెజెండ్స్ ఆధ్వర్యంలో ఈ కంపెనీ మరింత ముందుకు వెళ్తుంది అంటాడు ఆఫీసర్ అలాగే అనుని ఇబ్బంది పెట్టినందుకు కూడా సారీ చెప్తారు వాళ్ళు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మీరు రావటం మంచి పని అయింది లేకపోతే మన కంపెనీ పరువు పోయేది అంటాడు నీరజ్. కంగారు పడకు మన కంపెనీది సుదీర్ఘ ప్రయాణం దాన్ని తప్పు తవ పట్టించకపోవటమే మంచిది అని మాన్సీని చూసి చెప్తాడు ఆర్య. జెండే చెప్పినట్టు ఈ చైర్మన్ కుర్చీ బంగారు సింహాసనం కాదు ముళ్ళ సింహాసనం దీని మీద కూర్చోవడానికి నాకు అర్హత లేదు అంటాడు నీరజ్.
అది మనం డిసైడ్ చేయకూడదు మనం చేసే పని డిసైడ్ చేయాలి దాని కోసం ప్రయత్నించి ఆల్ ది బెస్ట్ అని చెప్పి భార్యని తీసుకొని వెళ్ళిపోతాడు ఆర్య. అప్పుడే బయటకు వచ్చిన అంజలి వాళ్ళిద్దర్నీ చూస్తుంది. అప్పు నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఈ అమ్మాయి రాజ నందిని టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది దాని గురించి ఎంక్వయిరీ కోసం నేనే పిలిపించాను అని అబద్ధం చెప్తాడు జెండే.
తను మీకు తెలుసా అని అడుగుతాడు జెండే. తెలుసా ఏంటి తను నా సిస్టర్ లాంటిది నా దగ్గరే వర్క్ చేస్తుంది అంటుంది అంజలి. టాపిక్ డైవర్ట్ చేద్దామని నీరజ్, అంజలికి థాంక్స్ చెప్పి నువ్వు ఆనంద్ గారిని తీసుకురావడం వల్లే ప్రాబ్లం సాల్వ్ అయింది అంటాడు. నాకెందుకు థాంక్స్ చెప్పడం వాళ్ళిద్దరికీ థాంక్స్ చెప్పండి అంటుంది అంజలి.
టైం అవుతుంది మనం బయలుదేరుదాము అని ఆర్య అనటంతో అను ని కూడా వాళ్లతో పాటు తీసుకువెళ్లిపోతుంది అంజలి. కారులో వెళ్తున్న సారీ అని మీ చేయి చూపించండి నాకు ఎందుకు మీరు హీరో అవ్వబోయి, ఎక్కడో మిస్ అయ్యి ఎక్కడ జాబ్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటుంది అంజలి. నాకు మాటలు వినబడలేదు కానీ దూరం నుంచి చూస్తే మీరే ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అనిపించింది.
మొత్తానికి ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ ని సేవ్ చేసిన ఘనత మీ ఇద్దరికీ దగ్గుతుంది కానీ క్రెడిట్ మొత్తం నాకే, ఎందుకంటే మీ ఇద్దరూ నా ఎంప్లాయిస్ కదా అంటుంది అంజలి. మనం పార్టీ చేసుకుందాము కాస్త కార్ ఆపండి అంటుంది. ఇక్కడేముంది అంటుంది ప్రీతి. పానీ పూరి బండి చూపించి అక్కడే ఒక పట్టు పడదాము పదండి అంటుంది అంజలి. నాకు సైట్ లో వర్క్ ఉంది అంటాడు ఆర్య.
ఎప్పుడు వర్క్ ఏనా, లైఫ్ లో చిన్న చిన్న ఆనందాలు కూడా ఉండాలి అంటూ వాళ్ళిద్దర్నీ ఒప్పించి తీసుకు వెళుతుంది. ఇవన్నీ ఎందుకు అంటాడు ఆర్య. హ్యాపీ లెస్ గురించి నా ఎంప్లాయిస్ వేరే వాళ్ళ కంపెనీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారంటే నాకు ప్రౌడ్ కదా అంటూ పానీపూరి ఆర్డర్ చేస్తుంది అంజలి. నార్మల్ గా తింటే ఏం చేస్తుంది పోటీ పెట్టుకుందాము ఎవరు ఎక్కువగా తింటే వాళ్ళే గెలిచినట్లు అంటుంది అంజలి.
ఆర్య దంపతులకి పాత మెమోరీస్ గుర్తొస్తాయి. వాళ్లు కూడా పోటీ స్టార్ట్ చేస్తారు. అంతా ఫాస్ట్ గా తినటం వల్ల అను పొలమారుతుంది. ఆర్య అను చేత మంచినీళ్లు తాగిస్తాడు. మీకు ఆడవాళ్లంటే ఎంత గౌరవం, మీ ఓన్ పర్సన్ లాగా నాకన్నా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు అని మెచ్చుకుంటుంది అంజలి. నేను మనీ పే చేస్తాను అని అంజలి మనీ పే చేసేలోపు ఆర్య అను నేను తీసుకెళ్లి జాగ్రత్తగా కారులో కూర్చోబెడతాడు.
అది గమనించిన అంజలి మా గురూజీ ఎంత మంచి వారు తను ప్రెగ్నెంట్ అని ఎంత కేర్ చూపిస్తున్నారు అని ప్రీతితో చెప్తుంది అంజలి. మొగుడు పెళ్ళాం మీద చూపించకపోతే మీ మీద నా మీద చూపిస్తారా అసలే వాళ్ళిద్దరిది హిట్ పెయిర్ అనుకుంటుంది ప్రీతి. కార్లో కూర్చో పెట్టిన తర్వాత నిజంగానే పొలమారిందా అని అడుగుతాడు ఆర్య. భార్య గెలుపు భర్తకి ఇష్టమేమో కానీ భర్త గెలుపు భార్యకి అందం అంటుంది అను.
మరోవైపు ఇంటికి వచ్చిన నీరజ్ ని ఏమైంది సమస్య పరిష్కారం అయిందా అని కంగారుగా అడుగుతుంది శారదమ్మ. దాదా ఉన్నచోట సమస్య ఉండదు అంటూ జరిగిందంతా చెప్తాడు నీరజ్. నేను చెప్పాను కదా అమ్మ దాదా దూరంగా ఉన్న మనల్ని ఆఫీసుకు అవసరంలాగా కాపాడుతున్నాడు అని అదే నిజమైంది అంటాడు నీరజ్. ఆర్య ఆపద్బాంధవుడు లాంటి వాడు.
అన్ని సమస్యలని తనమీద వేసుకుని భరిస్తాడు తన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటాడో అంటూ బాధపడుతుంది శారదమ్మ. ఈ టెన్షన్ లో భోజనం చేశావు లేదో అంటూ తల్లిని భోజనానికి తీసుకువెళ్తాడు నీరజ్. మరోవైపు ఆర్య ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆర్య వచ్చేసరికి తలుపు తీసి ఉండటంతో ఎక్కడికి వెళ్లావు అని భార్యని అడుగుతాడు ఆర్య.
ఆరిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను అయినా డోర్ దగ్గరకు వేసి వెళ్ళాను అంటుంది అను. అనుమానం వచ్చి తన సూట్ కేస్ చెక్ చేస్తే అందులో డబ్బులు కనిపించవు అదే విషయాన్ని అనుకి చెప్తాడు ఆర్య. మన ఇంట్లోకి ఎవరైనా రావడం ఎవరైనా చూశారేమో పక్కింటి వాళ్ళని అడుగుతాను అడ్వాన్స్ డబ్బులు కదా చూస్తూ ఎలా ఊరుకుంటాము అంటుంది అను.
అలా అడగకు ఎవరిని అడిగితే వాళ్ళనే అనుమానించినట్లు అవుతుంది నా మాట విను. బస్తీలోనే ఎవరో ఒకరు తీసి ఉంటారు ఆ ఒక్కరి కోసము అందర్నీ అనుమానించడం మంచిది కాదు ఆ డబ్బు వాళ్ళ అవసరానికి ఉపయోగపడుతుందని ఆనందిద్దాము అంటాడు ఆర్య. నేను జాగ్రత్తగా ఉండాల్సింది అని గిల్టీగా ఫీల్ అవుతుంది అను.
ఎలా పోయేది అలాగే పోతుంది నువ్వు భోజనం చేసావా అని అడుగుతాడు ఆర్య. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి మీరు వచ్చాక తీసుకొస్తే వంట చేద్దాం అని వెయిట్ చేస్తున్నాను అంటుంది అను. సరే ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్లి ఇడ్లీ తీసుకువస్తాడు ఆర్య. డబ్బులు లేకపోవడంతో ఒక ప్లేటుమాత్రమే తీసుకువస్తాడు.
అను అడిగితే క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో నేను అక్కడే తినేసాను అంటూ ఆమెకి అబద్ధం చెప్పి ఆమెతో టిఫిన్ తినే లాగా చేస్తాడు ఆర్య.తను పడుకున్న తర్వాత ఆకలితో ఆర్య కి నిద్ర పట్టదు. లేచి మంచినీళ్లు తాగి జీవితం నిజంగా చాలా గొప్పది రకరకాల పరీక్షలు పెట్టి మరి పాఠాలు నేర్పిస్తుంది అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.