కొత్త లవర్‌తో ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముఖ్‌.. దీప్తి కోసమేనా ఇంతటి దారుణం.. ఆడుకుంటున్న నెటిజన్లు..

Published : Mar 20, 2023, 09:52 AM IST
కొత్త లవర్‌తో ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముఖ్‌.. దీప్తి కోసమేనా ఇంతటి దారుణం.. ఆడుకుంటున్న నెటిజన్లు..

సారాంశం

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తి సునైనా విడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్త లవర్‌తో షణ్ముఖ్‌ రెచ్చిపోయి వీడియోలు చేస్తుండటం నెట్టింట హాట్‌ టాపిక్ అవుతుంది. 

యూట్యూబ్‌ వీడియోలో, వెబ్‌ సిరీస్‌, షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్‌ అయ్యాడు షణ్ముఖ్‌ జస్వంత్‌. ఈ స్టార్‌ ఇమేజే ఆయనకు బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. షోలో పాల్గొని రచ్చ చేశాడు షణ్ముఖ్‌. తనదైన ఆట తీరుతో ప్రశంసలందుకోవడంతోపాటు రన్నరప్‌గానూ నిలిచారు. అయితే సిరి విషయంలో మాత్రం ఆయన విమర్శలెదుర్కొన్నాడు. ఆట తీరు, ఆమెని మ్యానుపులేట్‌ చేసేలా వ్యవహరించారనే కామెంట్లు వినిపించాయి. దీని కారణంగానే తన లాంగ్‌ టైమ్‌ లవర్‌, తన యూట్యూబ్‌ కోస్టార్‌ దీప్తి సునైనా ఆయనకు బ్రేకప్‌ చెప్పింది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడు షణ్ముఖ్‌. ఫణి పూజిత అనే యూట్యూబ్‌ యాక్ట్రెస్‌తో ఆయన వరుసగా యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్నారు. రొమాంటిక్‌గా ఉండే ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ జంట కూడా తరచూ చర్చనీయాంశంగా మారుతుంది. షణ్ముఖ్‌ కొత్త లవర్‌ ని పట్టాడనే కామెంట్లు ఊపందుకున్నాయి. దీనికితోడు ఆయన పూజితతో కలిసి రొమాంటిక్‌ సాంగ్‌లు చేస్తుండటం, అందులో మరింతగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతుండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. 

తాజాగా షణ్ముఖ్‌, ఫణి పూజిత కలిసి చేసిన `అయ్యయ్యో` అనే యూట్యూబ్‌ సాంగ్‌ బాగా ట్రెండ్‌ అవుతుంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇందులో షణ్ముఖ్‌, పూజిత రొమాన్స్ లో పీక్‌లోకి వెళ్లారు. ఇద్దరు హగ్‌ చేసుకుంటూ, రాసుకుంటూ పూసుకుంటూ కనిపించారు. అంతేకాదు షణ్ముఖ్‌ మరో అడుగు ముందుకేసి వరుసగా ముద్దుల వర్షం కురిపించాడు. తన వొళ్లోకి తీసుకుని, గట్టిగా హగ్‌ చేసుకుంటూ, ఆమెతో ఇంటెన్స్ రొమాన్స్ తో రెచ్చిపోయాడు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నెటిజన్లు, దీప్తి లవర్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. 

నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు. `అరే ఏంట్రా ఇది` అంటూ ఆయన డైలాగ్‌తోనే సెటైర్లు పేలుస్తున్నారు. దీప్తిని రెచ్చగొట్టడం కోసమే ఇదంతా చేస్తున్నావా? అని, ఇది చాలా ఓవర్‌గా ఉంది బ్రో, దీప్తి సునైనాపై రివేంజ్‌ కోసం ఇంతలా దిగజారుతున్నావా? అని, దీన్ని దీప్తి చూస్తే చాలా ఫీలవుతుంది బ్రో, ఈ రకంగా ఓదార్పు పొందుతున్నావా? అని, ఎంతైనా హీరోయిన్‌ నీకు సెట్‌ కాలేదని, మేం షణ్ము-దీపు ఫ్యాన్స్ అని కామెంట్లు పెడుతున్నారు. దీపు,నువ్వు ఒకప్పుడు చాలా డీసెంట్‌గా చేసేవారు, ఇదేంది బ్రో ఇంతగా రెచ్చిపోతున్నావని ప్రశ్నిస్తున్నారు. ఈ జంటపై ట్రోల్స్, మీమ్స్ తో ఆడుకుంటున్నారు నెటిజన్లు. 

దాదాపు నాలుగైదేళ్లు ప్రేమించుకున్నారు షణ్ముఖ్‌, దీప్తి సునైనా. ఈ జంటకి యూట్యూబ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇద్దరు కలిసి దిగే ఫోటో షూట్లు, వీడియోలు బాగా ట్రెండ్‌ అయ్యేవి. కానీ ఉన్నట్టుండి బ్రేకప్‌ చెప్పుకోవడంతో ఇద్దరూ డిస్టర్బ్ అయ్యారు. ఆ డిస్టర్బెన్స్ ని దీప్తి సునైనా తరచూ బయటపెడుతూ కనిపించింది. ఇప్పుడిప్పుడే ఆమె రెగ్యూలర్‌ లైఫ్‌లో బిజీ అవుతుంది. అయితే ఇటీవల ఆమె కన్నీళ్లు పెడుతూ నన్ను వదిలేశావ్‌ అంటూ ఓ సాంగ్‌కి యాక్ట్ చేయడం అందరిని కదిలించింది. ట్రెండ్‌ అవుతుంది. అయితే ఆమె ఫన్నీగా చేసినా, నిజంగానే తన లోపల ఫీలింగ్‌ అదే అంటున్నారు ఫ్యాన్స్. అది ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు షణ్ముఖ్‌ చేసిన ఈ పని మరింత రచ్చ లేపుతుండటం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు