రాజమౌళికి ఏఎన్ ఆర్ నేషనల్ అవార్డు

Published : Sep 08, 2017, 08:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
రాజమౌళికి ఏఎన్ ఆర్ నేషనల్ అవార్డు

సారాంశం

అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఇచ్చే పురస్కారం ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఈ ఏడాది రాజమౌళిని వరించిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ప్రకటించిన సినీ నటుడు నాగార్జున

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అందించే పురస్కారం.. ఏఎన్ ఆర్ నేషనల్ అవార్డు. . తెలుగు సినీ పరిశ్రమకు కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈ అవార్డు దర్శకధీర రాజమౌళిని వరించింది. రాజమౌళి.. బాహుబలి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే ఈ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డును రాజమౌళికి అందజేస్తున్నట్లు సినీ నటుడు నాగార్జున తెలిపారు. రాజమౌళికి ఈ అవార్డు ప్రకటించడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన వివరించారు.

 

2006వ సంవత్సరం నుంచి  అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి సంవత్సరం ఈ అవార్డుని బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్ అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవీలు కూడా అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఇఫ్పుడు తాజాగా వీరి జాబితాలో రాజమౌళి కూడా చేరారు.

PREV
click me!

Recommended Stories

హ్యాపీడేస్ సీక్వెల్ కు రంగం సిద్దం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. పార్ట్ 2లో హీరోలు ఎవరంటే?
Trisha Home Tour : చెన్నై, హైదరాబాద్‌లో ఇంద్రభవనాల్లాంటి త్రిష ఇళ్లను చూశారా? ఎలా ఉంటాయంటే?