నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన కళ్యాణ్ రామ్!

Published : Mar 05, 2023, 04:35 PM IST
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన కళ్యాణ్ రామ్!

సారాంశం

నందమూరి ఫ్యామిలీ నుంచి.. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా తెలుగు ప్రేక్షకులకు మరో యంగ్ హీరో పరిచయం కాబోతున్నాడు. తాజాగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.   

దివంగత నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని.. ప్రస్తుతం సీనియర్ నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా మరో యంగ్ హీరోను నందమూరి ఫ్యామిలీ పరిచయం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ పెద్దకొడుకు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా  ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్, టైటిల్ ను  కూడా అనౌన్స్ చేశారు. 

బసవతారకం క్రియేషన్స్ బ్యానర్ (BTRC)పై సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా  నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రానికి ‘బ్రీత్’ (Breathe) అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. BTRC ప్రొడక్షన్ నెం.1గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి వీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను,  టైటిల్ పోస్టర్ ను నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri kalyan Ram) ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. 

పక్కా కమర్షియల్ చిత్రానికి జయకృష్ణ నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఎమోషనల్, థ్రిల్లర్ అంశాలతో నిర్మిస్తున్నారని నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు. పోస్టర్ వర్క్, టైటిల్ బాగుందని, సినిమా మంచి సక్సెస్ ను అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక చిత్రంలోని నటీనటులు, టెక్నీకల్ టీమ్ ఆయా వివరాలను మున్ముందు తెలియజేయనున్నారు. ఇక టైటిల్ ‘బీత్ : అంతిమ పోరాటం’ క్యాచీగా ఉంది. పోస్టర్ లో చైతన్య కృష్ణ వర్షంలో గొడుగు పట్టుకొని చెవిలో ఇయర్ బడ్స్ ద్వారా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం