రౌడీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, విజయ దేవరకొండ ఖుషీ మూవీ క్రేజీ అప్ డేట్ ఇచ్చిన డైరెక్టర్

Published : Mar 05, 2023, 03:40 PM IST
రౌడీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, విజయ దేవరకొండ ఖుషీ మూవీ క్రేజీ అప్ డేట్ ఇచ్చిన డైరెక్టర్

సారాంశం

కాస్త నిరాశగా ఉన్న రౌడీ ఫ్యాన్స్ కు ఉత్సాహం కలిగించే న్యూస్ చెప్పాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఖుషి సినిమా గురించి ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చేశాడు.   

చాలా కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. నిజం చెప్పాలంటే.. గీత గోవిందం తరువాత ఆ రేంజ్ లో సాలిడ్ హిట్ పడలేదు విజయ్ దేవరకొండకు. రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన లైగర్ ధారుణంగా పెయిల్యూర్ అవ్వడంతో.. విజయ్ కు గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది. అంతకు ముందు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు ధారుణంగా పోయాయి. ఈక్రమంలో టాక్సీవాల సినిమా ఒక్కటి కాస్త ఆడియన్స్ ను అలరించగలిగింది. లైగర్ డిజాస్టర్ తరువాత అందరి చూపు ఖుషీ సినిమాపైనే ఉంది. ఈసినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వలేకపోతే.. విజయ్ కెరీర్ ప్రమాదం లో పడే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయుంలో ఆచి తూచి అడుగు వేస్తుననాడు విజయ్. 

రౌడీ ఫ్యాన్స్ తో పాటు.. మూవీ లవర్స్ ఎంతో ఆత్రుతగా  ఎదురుచూస్తున్న  సినిమా  ఖుషి . ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో  విజ‌య్ దేవ‌ర‌కొండ  సమంత జంటగా  హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు  శివ‌నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఖుషి  మూవీ షూటింగ్ పెండింగ్ పడుతూ వస్తోంది. సమంత అనారోగ్యం కూడా ఇందుకు కారణం అయ్యింది. ఈక్రమంలో  ఖుషి  సినిమాపై  క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు. 

 

 పెండింగ్ లో ఉన్న షూటింగ్ ఇప్పట్లో మళ్లీ  మొదలవుతుందా అని  డైలామాలో ఉన్న అభిమానులకు శివనిర్వాణ- విజయ్ దేవరకొండ టీం క్రేజీ అప్డేట్ అందించింది.యాక్షన్‌ సీక్వెన్స్ తో ఖుషి కొత్త షెడ్యూల్‌ మొదలు కానుందని డైరెక్టర్ శివ నిర్వాణ తెలియజేశాడు. మార్చి 8న తాజా షెడ్యూల్‌ షురూ కానున్నట్టు తెలుస్తోంది. . పాపులర్ స్టంట్‌ మాస్టర్‌ పీటర్ హెయిన్స్, ఎడిటర్‌ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను శివ నిర్వాణ శేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఖుషి సినిమాలో  ముర‌ళీ శ‌ర్మ‌, స‌చిన్ ఖ‌డేక‌ర్‌, అలీ,  ల‌క్ష్మి,  రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ నటుడు జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తొలిసారి విజయ్ దేవ‌ర‌కొండ, సమంత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లకు వస్తుందా.. అని చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం