
బాలకృష్ణ చివరిగా ‘అఖండ’తో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఏకంగా 100 రోజుల పాటు థియేటర్లలో సందడి చేసిన బాలయ్య సినిమాగా 2022లో రికార్డు క్రియేట్ చేసింది. అటు ఓటీటీలోనూ దుమ్ములేపింది. మరోవైపు కలెక్షన్స్ కూడా ఊహించని స్థాయిలో వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బాలకృష్ణ (Balakrishna) ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఎన్బీకే107లో నటిస్తున్నాడు. దీని తర్వాత బాలయ్య ‘ఎఫ్3’ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో నటించనున్నాడు.
ఇఫ్పటికే బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒకే అయ్యి.. ప్రీపొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జులై మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. కాగా, బాలయ్య ఎంత పవర్ ఫుల్‌గా ఉంటారో.. అందుకు తగినట్లే ఆ సినిమా కూడా ఉంటుందన్నారు అనిల్. వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త మార్క్ చూపిస్తామని హామీనిచ్చారు. ఈ చిత్రంలో కామెడీ ఉందని, పూర్తి యాక్షన్ తోనే ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా నుంచి క్రేజీ బజ్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో ఇప్పటికే శ్రీలీల ముఖ్య పాత్ర పోషించనున్న విషయం తెలిపిందే. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar) కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు బజ్ వినిపిస్తోంది. అయితే రాజశేఖర్ ను తొలుత విలన్ పాత్రలోనైనా.. లేదంటే కామెడీ పాత్రలో అలరించనున్నట్టు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ పాత్రకు స్నేహితుడిగా రాజశేఖర్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అనిల్ రావిపూడి రాజశేఖర్ ఒరిజనల్ వాయిస్ నే సినిమాలో పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించారు. కానీ తన ఏ చిత్రానికి కూడా వాయిస్ చెప్పలేదు. కొన్ని మినహా అన్ని సినిమాకు సాయి కుమార్ వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కేరీర్ లోనే ఫస్ట్ టైం బాలయ్య సినిమాకు తన ఒరిజినల్ వాయిస్ ఇవ్వనున్నట్టు వార్తలపై అభిమానులు కూడా ఎగ్జైట్ ఫీలవుతున్నారు.