Puri-Vijay Deverakonda : పూరి, విజయ్ దేవరకొండ కాంబోలో మరో ప్రాజెక్ట్.. రేపే అఫిషియల్ అనౌన్స్ మెంట్..

Published : Mar 28, 2022, 11:31 AM ISTUpdated : Mar 28, 2022, 11:32 AM IST
Puri-Vijay Deverakonda : పూరి, విజయ్ దేవరకొండ కాంబోలో మరో ప్రాజెక్ట్.. రేపే అఫిషియల్ అనౌన్స్ మెంట్..

సారాంశం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇప్పటికే ‘లైగర్’ Liger మూవీ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి తాజాగా సమాచారం అందింది.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న చిత్రం ‘లైగర్’ Liger. ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. అందుకు తగట్టుగానే మూవీ నుంచి గతంలో వచ్చిన పోస్టర్స్, గ్లిమ్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో  వచ్చే అప్డేట్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ ను విజయ్ దేవరకొండ పోషిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ఆడిపాడనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లైగర్ మూవీలో భాగస్వామిగా ఉన్నారు. మణిశర్మ లైగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.   

లైగర్ షూటింగ్ పూర్తి చేసుకొని  దాదాపు నెలరోజులు గడిచింది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే రిలీజ్ కు ఇంకాస్త టైం ఉండటంతో పెద్దగా అప్డేట్స్ ఏమీ రావట్లేదు. మొన్న చార్మి కౌర్ అందించిన హింట్ ప్రకారం.. తాజాగా ఓ అప్డేట్ అందింది. అయితే ఈ అప్డేట్ మాత్రం లైగర్ మూవీకి సంబంధించిన కాదు. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ రానున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త మిషన్ కు సంబంధించిన వివరాలను రేపు మధ్యాహ్నం 2:20 నిమిషాలకు అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు చార్మి కౌర్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

అయితే, గతంలోనే పూరీ, విజయ్ కాంబోలో పాన్ ఇండియన్ మూవీ ‘జన గన మన’ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. అయితే రేపు వచ్చే అప్డేట్ దానికి సంబంధించినదేనని అభిమానులు భావిస్తున్నారు. లేక ఇంకేదైనా అప్డేట్ వస్తుందా అన్నది చూడాలి. మరోవైపు పూరి జగన్నాథ్..  జన గన మన మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌