Varun Tej New Film : నాగార్జున డైరెక్టర్ తో వరుణ్ తేజ్ కొత్త మూవీ షురూ... పూజా కార్యక్రమం పూర్తి..

Published : Mar 28, 2022, 10:28 AM IST
Varun Tej New Film : నాగార్జున డైరెక్టర్ తో వరుణ్ తేజ్ కొత్త మూవీ షురూ...  పూజా కార్యక్రమం పూర్తి..

సారాంశం

హీరో వరుణ్ తేజ్ (Varun Tej New Film) మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.  తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది.  

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) వరుస సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. శక్తి వంచనలేకుండా విభిన్న కథల్లో నటిస్తూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వరుణ్ తేజ్ తన కేరీర్ బిగినింగ్ నుంచే విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనా నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటూ వస్తున్నాడు. వరుణ్ తేజ్ చివరిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ‘గని’(Ghani)లో నటించాడు. ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

తాజాగా వరుణ్ మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. తాజాగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ‘అత్తారింటికి దారేది’, దోచేయ్, సాహసం, మగధీర వంటి చిత్రాలకు ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తున్న తాజా చిత్రంలో వరుణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఈ రోజు ఉదయం జరిగింది. నటుడు, ప్రొడ్యూసర్ నాగబాబు (Nagababu) క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. పద్మ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 

ఈ కొత్త సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) డైరెక్ట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ .35గా మూవీ రూపుదిద్దుకోనుంది. త్వరలో సినీ తారాగణం, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నిషీయన్స్ వివరాలను వెల్లడించనున్నాను.  డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గతంలో ‘రోటీన్ లవ్ స్టోరీ, గుంటూరు టాకీస్, గరుడ వేగ, లెవెంత్ అవర్’ చిత్రాలను నిర్మించారు. తాజాగా అక్కినేని నాగార్జున (Nagarjuna) నటిస్తున్న  ‘ది గోస్ట్’ The Ghost చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. త్వరలోనే వరుణ్ తేజ్ న్యూ ఫిల్మ్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా