RRR: 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ పై 'కాశ్మీరీ ఫైల్స్' ఇంపాక్ట్ ఏ మేరకు..ఎంత శాతం?!!

Surya Prakash   | Asianet News
Published : Mar 28, 2022, 11:02 AM IST
RRR: 'ఆర్ఆర్ఆర్'  కలెక్షన్స్ పై 'కాశ్మీరీ ఫైల్స్' ఇంపాక్ట్ ఏ మేరకు..ఎంత శాతం?!!

సారాంశం

ఇప్పటికే ఈ సినిమా 220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మరి కొన్ని రోజుల్లో 300 కోట్ల వసూళ్లను కూడా సాధిస్తుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు లెక్కలు వేసారు.ఈ సినిమా సాధించిన విజయం ముందు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ సినిమా కనిపించకుండా పోయింది. 

 

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కేవలం రెండు సినిమాలకు సంబంధించిన కబుర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.అందులో మొదటిది ఇప్పటికే ది కశ్మీర్‌ ఫైల్స్. ఈ సినిమా  ఎమోషనల్ గా కాశ్మీరీ పండిట్ల గురించి చూపించడం జరిగింది.దాంతో ఈ సినిమా కు దేశ వ్యాప్తంగా జనాలు నీరాజనాలు పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మరి కొన్ని రోజుల్లో 300 కోట్ల వసూళ్లను కూడా సాధిస్తుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు లెక్కలు వేసారు.ఈ సినిమా సాధించిన విజయం ముందు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ సినిమా కనిపించకుండా పోయింది.  ఈ క్రమంలో  రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా పరిస్దితి ఏమిటని కొందరు ఇండస్ట్రీ వర్గాలు, మీడియావారు రిలీజ్ కు ముందు ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అటువంటిదేమీ లేదు. ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ ఈ వీకెండ్ లో దుమ్ము రేపాయి.

రెండు వారాల పాటు కంటిన్యూగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ దాదాపు ఎండ్ కు  చేరుకుంది. ఎక్సపెక్ట్ చేసినట్లుగా ఆర్ఆర్ఆర్ ప్రభావం దీని మీద గట్టిగా పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమా మంచి లాభాలు వచ్చేయటంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందేం లేదు. 15 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఊహించని విధంగా 220 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ది కాశ్మీర్ ఫైల్స్ కి కొన్ని చోట్ల కలెక్షన్స్ బాగున్నాయి. కానీ చాలా చోట్ల డ్రాప్ అయ్యింది.

RRR ప్రభావం ప్రక్కన పెడితే ఇప్పటికిప్పుడు మెట్రో నగరాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ ని పూర్తిగా తీసేయ  లేదు.   అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే ఫ్లాఫ్  కావడంతో చాలా చోట్ల తీసేశారు.  ఏప్రిల్ 13 బీస్ట్, 14న కెజిఎఫ్ 2 వచ్చేలోగా మరో పాతిక కోట్ల దాకా వచ్చేలా టార్గెట్ సెట్ చేసుకున్నారు.  RRR డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పై ఇంపాక్ట్  పడలేదు. రేట్లు పెంచటంతో మొత్తం ఈ వీకెండ్ లోనే చాలా వరకూ రికవరీ లు అయ్యాయి.
 
 మరో ప్రక్క కశ్మీరీ ఫైల్స్ ...ఇప్పటికే చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు.మరి కొన్ని రోజుల్లో ఓటీటీ లో వస్తుందని ఎదురు చూసే వారు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 80 శాతానికి పైగా థియేటర్లను కశ్మీర్ ఫైల్స్  సినిమాకు తొలగించారని సమాచారం. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ పై కొంచెం కూడా కశ్మీరీ ఫైల్స్ ఇంపాక్ట్ పడలేదనే చెప్పాలి.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా