‘ఆర్ఆర్ఆర్’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు.!

Published : Dec 06, 2022, 11:06 AM IST
‘ఆర్ఆర్ఆర్’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు.!

సారాంశం

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు అవార్డుల పంట కొనసాగుతోంది. రీసెంట్ గానే యూఎస్ఏ నుంచి జక్కన అవార్డు అందుకోగా.. తాజాగా కాస్ట్ అండ్ క్రూకు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.  

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తనదైన దర్శకత్వంతో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం దక్కేలా చేశారు. తెలుగు సినిమాలకే వన్నె తెచ్చారు. రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’(RRR)తో మరో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్, తారక్ - చెర్రీ పెర్ఫామెన్స్, జక్కన మార్క్ డైరెక్షన్, యాక్షన్ సీక్వెల్స్ కు వరల్డ్ వైడ్ సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. జపాన్, యూఎస్ఏలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఇండియన్ సినిమాలోనే మరో సంచలనంగా మారిన ఈ చిత్రం 2023 ఆస్కార్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే, ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డుల పంట కొనసాగుతోంది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గా దర్శక ధీరుడు SS Rajamouli
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఉత్తమ దర్శకుడిగా అవార్డును దక్కించుకున్నారు. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరో గౌరవం దక్కింది.  కాస్ట్ అండ్ క్రూకి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (HCA) నుంచి క్రిటిక్స్ స్పాట్ లైట్ అవార్డును సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్ ప్రతిభను, నటీనటుల పెర్ఫామెన్స్ కు అసోసియేషన్ నుంచి గుర్తింపు దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

అలాగే, మరో అవార్డు కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో పడింది. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (AFCC) అవార్డ్స్ 2022లో మరో గౌరవాన్ని పొందింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో ఈ అవార్డును కైవసం చేసుకుంది.  ఈ విషయాన్నిAFCC అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వరుస అవార్డులను కొల్లగొడుతూ తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. దీంతో రాజమౌళి - మహేశ్ బాబు కాంబోలో వచ్చే నెక్ట్స్ ఫిల్మ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?