Bigg Boss 6 Telugu: శ్రీహాన్‌ షర్ట్స్ పై సిరి ముద్దులు.. ఇక `ముద్దుల మామయ్య`గా రచ్చ.. డైరెక్ట్ నామినేషన్స్

Published : Dec 05, 2022, 11:55 PM IST
Bigg Boss 6 Telugu: శ్రీహాన్‌ షర్ట్స్ పై సిరి ముద్దులు.. ఇక `ముద్దుల మామయ్య`గా రచ్చ.. డైరెక్ట్ నామినేషన్స్

సారాంశం

ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. రేవంత్‌, శ్రీహాన్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ ఉన్నారు. ఇందులో శ్రీహాన్‌ ఆల్‌ రెడీ ఫైనల్‌కి చేరారు. ఇక ఫైనల్‌కి చేరేమరో నలుగురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీహాన్‌, సిరి లవర్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే సిరి ప్రేమలోని రహస్యాన్ని వెల్లడించారు శ్రీహాన్‌. ముద్దుల మామయ్యగా మారిపోయాడు. బిగ్‌ బాస్‌ 6 తెలుగు షో 13 వారాలు కంప్లీట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఫైమా ఎలిమినేట్ అయ్యింది. 14వ వారంలోకి అడుగుపెట్టారు. సోమవారం నుంచి కంటెస్టెంట్లకి విచిత్రమైన టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. మరోవైపు గ్యాప్‌ దొరికితే ఒకరిపై ఒకరు ఆరోపలు, కామెట్లు చేస్తూ కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. 

ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. రేవంత్‌, శ్రీహాన్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ ఉన్నారు. ఇందులో శ్రీహాన్‌ ఆల్‌ రెడీ ఫైనల్‌కి చేరారు. ఇక ఫైనల్‌కి చేరేమరో నలుగురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఏడు స్థానాల్లో ఎవరు ఏ స్థానానికి అర్హులో ర్యాకింగ్‌తో చెప్పాలని తెలిపారు. ఇందులో రేవంత్‌ మొదటి స్థానం ఇచ్చుకోగా, ఇనయ రెండో స్థానం, కీర్తి మూడు, శ్రీ సత్య 4, శ్రీహాన్‌ ఐదు, ఆదిరెడ్డి 6, రోహిత్‌ ఏడో స్థానాల్లో నిలిచారు. అందరి ఏకాభిప్రాయం ప్రకారం రేవంత్‌ మొదటి స్థానం, శ్రీహాన్‌ రెండో స్థానం, ఆదిరెడ్డి మూడు, ఇనయ నాలుగు, శ్రీ సత్య ఐదు, రోహిత్‌ ఆరు, కీర్తి ఏడు స్థానం ఇచ్చారు. 

ఇందులో రేవంత్‌ ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకోగా, ఈ షోకి అన్‌ డిజర్వ్ కి ఎవరనేది ఫైనల్‌కి చేరిన శ్రీహాన్‌ చెప్పాలని బిగ్‌ బాస్‌ ఆదేశించారు. అందుకు ఆయన రోహిత్‌కి ఆ ట్యాగ్‌ ఇచ్చాడు. మరోవైపు ఇంటి సభ్యుల మధ్య గుసగుసలు ఎక్కువ అయ్యాయి. బాత్‌ రూమ్‌ విషయంలో తన వాదన తప్పు అంటున్నారని బాధ పడ్డారు శ్రీహాన్‌. కీర్తి తనని విమర్శించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడు. 

మరోవైపు శ్రీహాన్‌,శ్రీ సత్యల మధ్య కూడా గొడవ బాగానే జరిగింది. శ్రీహాన్‌ మారిపోయాడని, అప్పుడు ఒకలా ఉన్నాడని, ఇప్పుడు మరోలా బిహేవ్‌ చేస్తున్నాడని, ఎప్పుడు ఒకలా ఉండరని తెలిపారు. ఈ క్రమంలో శ్రీహాన్‌ ఓ సీక్రెట్‌ బయట పెట్టాడు. ఇకపై తాను `ముద్దుల మామయ్య`గా మారిపోయానని తెలిపారు. తను వేసే ప్రతి షర్ట్ పై సిరి ముద్దు ఉంటుందన్నారు. అది విన్న రేవంత్‌ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం. 

మరోవైపు తనని అన్‌ డిజర్వ్ అనే ట్యాగర్‌ ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తంచేశాడు. శ్రీహాన్‌ ఫేక్‌ పర్సన్‌ అని, కెమెరా ముందు నటిస్తాడని తెలిపారు. తనకు చాలా సిల్లీ రిజన్‌ ఇచ్చాడని తెలిపారు. అనంతరం `పే బ్యాక్‌` గా ఏదో ఒకటి ఇవ్వాలి ఉంటుంది. ఇందులో గతంలో గేమ్‌లో బిగ్‌ బాస్‌ 6 తెలుగు విన్నర్‌ ప్రైజ్‌ మనీ కొంత అమౌంట్‌ లాస్‌ అయిన విషయంతెలిసిందే. ఇందులో లక్ష వరకు మనీ పొందే అవకాశం ఉంది. అందుకోసం శ్రీ సత్య, రోహిత్‌ టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో శ్రీ సత్య గెలిగించింది. అయితే దీనిపై ఓటింగ్‌ పెడితే అందరు సభ్యులు రోహిత్‌ గెలుస్తారనుకున్నారు. కానీ సత్య గెలవడంతో ఆ అమౌంట్‌ గెలుచుకోవడంలో ఇంటి సభ్యులు విఫలం అయ్యారు.

ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్లకి సంబంధించి అంతా నామినేట్‌ అయ్యారు. శ్రీహాన్‌ డైరెక్ట్ ఫైనల్‌కి చేరుకోగా మిగిలిన ఆరుగురు రేవంత్‌, ఇనయ, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి, రోహిత్‌ డైరెక్ట్ గా మినేట్‌ అయ్యారు. మరి వీరిలో హౌజ్‌ని వీడే దెవరిది అనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్